పుష్ప-2 సినిమా ఎన్నో అడ్డంకులను దాటుకొని విడుదలైంది. ఇక విడుదలైన రోజు కూడా ఒక ప్రాణం బలి అవ్వడంతో పుష్ప-2 సినిమాపై ఎన్నో నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ బన్నీ అభిమానులు వాటిని తిప్పి కొట్టారు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అందులోనూ అల్లు అర్జున్ సినిమా కాబట్టి అభిమానుల తాకిడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమయంలో ఫ్యామిలీతో వచ్చి ఎందుకు అలాంటి సాహసం చేసింది అని కొంతమంది రేవతి ఫ్యామిలీని తిట్టి పోశారు ఏది ఏమైనప్పటికీ ఒక మహిళ ప్రాణమైతే పోయింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా పుష్ప టు కి మరో షాక్ తగిలింది..ఆ పేరు సినిమా నుండి తొలగించకపోతే ఇంటికి వచ్చి మరీ కొడతాం అంటూ పుష్ప టు నిర్మాతలకు వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇంతకీ పుష్ప టు సినిమాలో ఏది వివాదాస్పదం అయింది దేని గురించి వార్నింగ్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
పుష్ప టు సినిమాలో బన్నీకి విలన్ గా పోలీస్ పాత్రలో ఫహద్ ఫాజిల్ బన్వర్స సింగ్ షెకావత్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో పదేపదే "దమ్ముంటే కాస్కోరా షెకావత్తూ పట్టుకుంటే వదిలేస్తా సిండికేటూ" అనే పదం ఎక్కువగా వస్తుంది. అయితే షెకావత్ అనే పదాన్ని పదే పదే ఉపయోగించి క్షత్రియ సమాజాన్ని అవమానిస్తున్నారు అంటూ కర్ణసేన సంఘం రాజ్ షెకావత్ ఈ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు.అంతేకాదు పుష్ప టు సినిమా నుండి షెకావత్ అనే పదాన్ని తొలగించకపోతే పుష్ప -2 నిర్మాతలను ఇంటికి వెళ్లి మరీ కొడతాం అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు.
వాక్ స్వాతంత్రం ఉండడం వల్ల సినిమాలలో ఇలాంటి ఇతరులను కించపరిచే వాటిని వాడుకోవడం ఏమాత్రం మంచిది కాదని షెకావత్ అనే పదాన్ని ఉపయోగించి క్షత్రియ కమ్యూనిటీని దారుణంగా అవమానించారంటూ వాళ్ళు బాధపడుతున్నారు. అంతే కాదు సినిమా నుండి షెకావత్ అనే పదాన్ని తొలగించకపోతే ఎన్ని హద్దులైనా దాటి ఇంటికి వచ్చి మరీ కొడతాం అంటూ పుష్ప-2 నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. మరి రాజ్ షెకావత్ చేసిన కామెంట్లపై పుష్ప-2 నిర్మాతలు ఎలా స్పందిస్తారు.. పుష్ప టు సినిమా నుండి షెకావత్ అనే పదాన్ని తొలగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.