టీజర్: రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్.. లవ్ బయటపడినట్టేనా..?

Divya
రష్మిక హీరోయిన్గా తాజాగా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ .. ఈ సినిమాని గీత ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ పైన అల్లు అరవింద్, మారుతి నిర్మాణంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.. ఇటీవల పుష్ప-2 చిత్రం కూడా రష్మికకు ప్రశంసలు అందుకునేలా చేస్తోంది.. ఇప్పుడు తాజాగా ది  గర్ల్ ఫ్రెండ్  ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ఈ టీజర్ కి విజయ్ దేవరకొండ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా ఒక లవ్ స్టోరీ గా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే కనిపిస్తోంది.. అలాగే రష్మిక ఒక కాలేజీలో జాయిన్ అవ్వడం ఆ కాలేజీ హాస్టల్ లో ఒక అబ్బాయితో ప్రేమలో పడడం ఆ తర్వాత ఆ ప్రేమలోని బాధలు ఇందులో చాలా క్లియర్ కట్ గా చూపించారు. టీజర్ చూస్తూ ఉంటే ఒక అమ్మాయి కోణంలో నుంచి సాగే లవ్ స్టోరీ కథా అన్నట్లుగా తెలుస్తోంది..



అయితే ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజెన్స్ మాత్రం ఈ సినిమా విజయ్ దేవరకొండ ను ఊహించుకొని రష్మిక చేసిందా లేకపోతే విజయ్ దేవరకొండ రష్మిక కోసమే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ చెప్పారా తన మనసులో మాట ఈ విధంగా తెలియజేశారు అనేట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రం ద్వారా ఇద్దరు కూడా ఓపెన్ అయ్యారేమో అన్నట్టుగా పలువురు అభిమానులు కూడా మాట్లాడుకుంటున్నారు.. గతంలో కూడా వీరిద్దరి మధ్య ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి. వీటిని ఎప్పుడు ఖండించలేదు..ఇటీవలే ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్నట్లుగా ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మరి మొత్తానికి ఈ టీజర్ తో అయితే రష్మిక ఎమోషనల్ గా ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: