2024 లో అత్యధిక పారితోషికం తీసుకొన్న‌ ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే ..!

Amruth kumar
మన చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు .. పోతున్నారు వారిలో కొందరు మాత్రమే అగ్ర హీరోయిన్ల గా దూసుకుపోతున్నారు .. అయితే దాదాపు 20 ఏళ్లు గా మన సౌత్ చిత్ర పరిశ్రమ లో తన  నటనతో మెప్పిస్తుంది .. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది .. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరంటే .. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాల తో సౌత్ చిత్ర పరిశ్రమను ఏలింది . ఇక కొన్నాళ్లు గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మరోసారి తనదైన‌ రీతిలో దూసుకుపోతుంది .. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరే కాదు స్టార్ బ్యూటీ త్రిష ..

ఈ సంవత్సరం చేతినిండా సినిమాల తో ఎంతో బిజీగా ఉంది హీరోయిన్ త్రిష .. అంతేకాకుండా 2024 లోఅత్యధిక రెమ్యూనరేషన్  తీసుకున్న హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది . అందం అబిన‌యంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది .. వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉంది .. 20 ఏళ్ల క్రితం సినిమాల్లో అడుగుపెట్టిన త్రిష ఇప్పటికీ అదే జోరుతో కొనసాగుతుంది.  ఇక 2002 అమీర్ దర్శకత్వంలో వచ్చిన మౌనం పసియతే సినిమాతో హీరోయిన్గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ఇందులో సూర్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం మార్కెట్ పడిపోయి సరైన సినిమా అవకాశాలు లేకపోయినా 96 సినిమాతో మరోసారి కం బ్యాక్ ఇచ్చింది ..

 అలాగే పోన్నియ‌న్ సెల్వ‌న్‌ సినిమాతో మరో బంపర్ హిట్ అందుకుంది . ఇక తర్వాత విజయ్ కు జంట‌గా లియో సినిమాలతో మంచి హిట్ అందుకుంది . ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జంటగా విశ్వంభర , అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తుంది . ఇక ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీ త్రిష తాను నటించే ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది . ఇక మన సౌత్ ఇండియన్ సినిమాలోనే అత్యధిక రెమెండేషన్ తీసుకునే హీరోయిన్గా త్రిష నిలిచింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: