చెప్ప‌ను బ్ర‌ద‌ర్ నుంచి థాంక్యూ బాబాయి వ‌ర‌కు.. బ‌న్నీ పూర్తిగా న‌మ్మొచ్చా..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
గత కొంతకాలంగా అల్లు అర్జున్ మెగా బ్రాండ్ వదిలి.. సొంతంగా అల్లు ఆర్మీ సిద్ధం చేసుకుంటూ మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్ళటం.. అక్కడ ఆయన చేసిన కామెంట్లు అల్లు అర్జున్ ని పూర్తిగా మెగా అభిమానులకు దూరం చేశాయి. ఒకవైపు తన ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటే.. బన్నీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వటంపై చాలా మాటలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటినుంచి మెగా వేరు, అల్లు వేరు అనేలా మార్పులు వచ్చాయి.

అప్పుడెప్పుడో మెగా అభిమానులు.. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని అడిగితే చెప్పను బ్రదర్ అంటూ బన్నీ పవన్ ఫ్యాన్స్ కి క్లాస్ ఇచ్చాడు. అప్పటి నుంచి అల్లు అర్జున్ లో మార్పు కనిపిస్తూ వస్తోంది. ఆ తర్వాత అల్లు అర్జున్ వేసిన చాలా అడుగులు మెగాకు దూరం అవ్వాలని చేసినట్టుగా అనిపిస్తూ వచ్చింది. దీనిపై చాలా విమర్శలు వచ్చినా.. అల్లు అర్జున్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. సినిమాలో డైలాగ్ లేకపోయినా బాస్ పేరుతో మెగా ఫ్యామిలీని అవమానకరంగా మాట్లాడుతూ.. కావాలనే కామెంట్లు పెట్టారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్‌లో మార్పు క‌నిస్తోంది. సినిమా టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వటం పై బన్నీ ప్రశంసలు కురిపించాడు. కళ్యాణ్ బాబాయి అంటూ పాత అల్లు అర్జున్ ని గుర్తు చేశారు. టిక్కెట్ల ధరలు పెంచుకునే జీవో రావటానికి కారణమైన ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్యూ. నా వ్యక్తిగతంగా కూడా కళ్యాణ్ బాబాయ్ కి థాంక్యూ అంటూ అల్లు అర్జున్ మాట్లాడారు. దీంతో మెగా అభిమానులు కూడా.. మీరు మారిపోయారు బ‌న్నీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: