పుష్ప 2 లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మతిపోతుంది..!
పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీని ఓ సీన్లో పుష్ప రాజ్ ఎర్రచందనం ఇంటర్నేషనల్ డీల్ చేస్తాడు .. డీల్‌లో ఒక వ్యక్తితో వచ్చిన ఈ చిన్నది .. ఇంతకీ బాలీవుడ్ హీరోయిన్ ఆమె ఎవరు .. ? ఏ సినిమాలో నటించింది వంటి వివరాలు కోసం సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నెటిజెన్లు .. ఇంతకి ఆమె ఎవరు అనేది ఇక్కడ చూద్దాం . ఇంతకి ఆ హీరోయిన్ మరెవరో కాదు .. ఆంచల్ ముంజల్ .. బి టౌన్ టెలివిజన్‌లో పలు సినిమాల్లో నటించింది ఈ అందాల భామ .. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరకు పరిచయమైన ముంజాల్.. 2008లో ధూమ్ మచావో ధూమ్ అనే సిరీస్‌తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది .. ఆ తర్వాత 2010లో వచ్చిన విఆర్ ఫ్యామిలీ అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది .. ఇందులో తన పర్ఫామెన్స్ తో మంచి క్రెజ్ తెచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించింది..
‘ఘోస్ట్ బనా దోస్త్’, ‘పర్వర్రిష్’, ‘గుమ్రః’, ‘వెల్కమ్’, ‘బడే అచ్చే లగ్తే హాయ్’, ‘ప్రెట్ బాయ్స్’ లాంటి టీవీ షోలలో నటించిన ఈమె.. ‘ఘాయల్: ఒన్స్ అగైన్’, ‘ఆరక్షన్’, ‘ముంబై స్పెషల్ 6’ వంటి చిత్రాల్లో కనిపించింది. అలాగే తమిళంలో ‘సే’ అనే చిత్రం చేసింది. ఇక ప్రస్తుతం ఇప్పుడు పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రెజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు కనిపించింది ఒక్క సీన్ అయినప్పటికీ కుర్రాళ్ళు ఈమె కోసం సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు .. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోలు షేర్ చేస్తూ.. యూత్ ను తెగ టెంప్ట్ చేస్తూ ఉంటుంది .. ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.