2024 లో విడాకులు తీసుకొని విడిపోయిన స్టార్ సెలబ్రిటీ జంటలు వీరే..!
ఐశ్వర్య రజినీకాంత్ , ధనుష్ : సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకులు తీసుకుని విడిపోయారని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.. ధనుష్ - ఐశ్వర్య 2004లో పెళ్లి చేసుకున్నారు .. అయితే వారు 18 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను: 29 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏఆర్ రెహమాన్ తన భార్య నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారులు ప్రకటించారు.. ఏఆర్ రెహమాన్ , సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ సంవత్సరం మొదట్లో జనవరిలో తమ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. సానియా తు విడాకుల తర్వాత షోయబ్ మరో పాకిస్తాన్ నటి సానా జావేద్ ను పెళ్లి చేసుకున్నాడు.
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్: 2024 సంవత్సరం ప్రారంభం నుండి, హార్దిక్ మరియు నటాషాల విడాకుల చర్చలు ఊపందుకున్నాయి. పెళ్లయిన 4 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటి నుంచో హాట్ హాట్ చర్చల తర్వాత ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈషా డియోల్, భరత్ తఖ్తానీ: హేమ మాలిని కుమార్తె ఈషా డియోల్, భరత్ తఖ్తానీ కూడా ఈ సంవత్సరం విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. మలైకా అరోరా, అర్జున్ కపూర్: 2019లో అర్జున్ కపూర్, మలైకా అరోరా తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరకు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.