కమర్షియల్ సినిమా అర్థం మార్చేస్తున్నారుగా.. పెర్ఫార్మన్స్ పాత్రలకే హీరోలు సై..!

Amruth kumar
కమర్షియల్ సినిమాకు ప్రస్తుతం చిత్ర పరిశ్రమంలో అద్దం మారిపోతుందా లేదంటే మన స్టార్ హీరోలే కమర్షియల్ సినిమా అనే పదానికి అర్థం మార్చేస్తున్నారా ? గతంలో చొక్కా నలగకుండా 100 మందిని ఎగరేసి కొట్టేవాళ్ళు ఇప్పుడు ఒక్కో పాత్ర కోసం రాత్రింబవళ్లు చెమట చిందించటానికి కారణం ఏమిటి ? చిత్ర పరిశ్రమలో మార్పు మొదలైందా లేదంటే మార్కపోతే కష్టమని మన హీరోలే మారిపోతున్నారా ? అసలేం జరుగుతుంది ..? తెలుగు చిత్ర పరిశ్రమ లో కమర్షియల్ సినిమాకు రోజురోజుకు అర్ధం మారిపోతుంది.

అద్దం పద్దంలేని కథ‌లకంటే పర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మన స్టార్ హీరోలు. అటువంటి కథలకే తమ నటనతో కమర్షియల్ స్టామినా  తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మన హీరోలు మాస్ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నారు .. రంగస్థలం నుంచి ఈ ట్రెండ్ మరింత మొదలైంది . ఇక రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో రంగస్థలం లాంటి సినిమా సుకుమార్ అనౌన్స్ చేసినప్పుడు చిత్ర పరిశ్రమ అంతా షాక్ అయింది . కానీ సినిమా రిలీజ్ అయ్యాక .. తన నటనతో అందరినీ షాక్ అయ్యేలా చేశాడు చరణ్.. సినిమా వచ్చి ఆరు సంవత్సరాల దాటిన ఇప్పటికీ రంగస్థలం ఇంపాక్ట్ తగ్గలేదు. ఆ తర్వాత పుష్ప కోసం అల్లు అర్జున్ అలాగే మార్చేశాడు సుకుమార్.

ఇక పుష్ప  తో అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు తాజాగా పుష్ప 2 సినిమాలోని అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ప్రధానంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ కైతే అభిమానులకు పూనకాలు తెప్పించాడు. ఇదే ఫార్ములా తో మిగిలిన హీరోలు కూడా వరుస‌ సినిమాలు చేస్తున్నారు. ఇక గత సంవత్సరం నాచురల్ స్టార్ నాని దసరాతో ఇదే మ్యాజిక్ రిపీట్ చేశారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ మాస్ మూవీ చేయబోతున్నాడు. మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మార్పు మంచికే అని అంటున్నారు ఆడియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: