2 రోజుల్లో హైయెస్ట్ వసూళ్లను రాబట్టిన టాప్ 6 సౌత్ మూవీస్ ఇవే.. పుష్ప ప్లేస్ అదే..?

Pulgam Srinivas
రెండు రోజుల్లో హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన టాప్ 6 మూవీస్ ఏవి ..? అందులో పుష్ప పార్ట్ 2 మూవీ ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 425 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇప్పటి వరకు సౌత్ నుండి వచ్చిన సినిమాలలో రెండు రోజుల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో ఈ మూవీ మొదటి స్థానంలో ఉంది. ఇకపోతే ఈ సినిమాను మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 358 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో ఉంది. ఈ సినిమాలో అనుష్క , తమన్నా హీరోయిన్లుగా నటించారు.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 356 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో ఉంది.

యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ 293 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో నాలుగవ స్థానంలో ఉంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 279.60 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... దీపికా పదుకొనే , అమితా బచ్చన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ 251.15 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: