సీఎం పేరును మర్చిపోయిన అల్లు అర్జున్.. మళ్లీ భలే కవర్ చేశాడే?
అల్లు అర్జున్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, హిందీ రాష్ట్రాల్లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన్ని ప్రభాస్ తరువాత తెలుగు సినిమా నుండి వచ్చిన నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్‌గా పిలుస్తున్నారు. పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించడంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించి మీడియాతో ముచ్చటించింది.
ఈ కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ, ముఖ్యమైన వ్యక్తుల పేర్లు గుర్తుకు రాక కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. ముందుగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాలేదు. దాంతో చాలా తడబడ్డారు. మీడియా వారు ఆయన పేరు గుర్తు చేయగా, అప్పుడు బన్నీ తెలుసుకున్నారు. అయితే గొంతులో తడి ఆరిపోయి మాట రాలేదని, తనకు సీఎం పేరు బాగా గుర్తుందని అన్నట్లు కవర్ చేసుకున్నారు. ఆయన నీరు తాగి మళ్ళీ మాట్లాడటం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డికి థాంక్స్ అని చెప్పారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ సినిమా మంత్రి కందుల దుర్గేశ్ కృతజ్ఞతలు తెలిపేటప్పుడు ఆయన పేరులోని మొదటి పేరు మాత్రమే గుర్తుచేసుకున్నారు. దీంతో మీడియా వారు మళ్ళీ ఆయన పూర్తి పేరు చెప్పారు. బన్నీకే సినిమానే ప్రపంచం. అందుకే నేషనల్ అవార్డు గెలుచుకోగలిగాడు. మిగతా విషయాలు ఆయనకు తెలియాల్సిన అవసరం లేదు అని ఫ్యాన్స్ సమర్థత ఇచ్చుకుంటున్నారు.
ఇక బన్నీ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే విషయం ఈ సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. అయినప్పటికీ, ఆయన ఒక వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడితో సంబంధం కలిగి ఉన్నందున కొంతమంది మెగా ఫ్యాన్స్ ఆయన్ని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించడంతో అల్లు అర్జున్ స్టార్‌డమ్ మరింత పెరిగింది.