బన్నీ ఆ విషయాన్ని మరిచిపోయాడా..? కావాలనే అలా చేశాడా..?
ఇంత పెద్ద హిట్ అవ్వడంతో పుష్ప2 సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించారు మూవీ టీం. అల్లు అర్జున్ స్టేజ్ పైకి వచ్చి స్పీచ్ తో అదరగొట్టేసాడు . మరి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కి థాంక్స్ చెప్తూ తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ ఆపేసి గొంతు ఎండిపోతుంది వాటర్ బాటిల్ ఇవ్వండి అంటూ వాటర్ తాగి కొంచెం సేపు తర్వాత మళ్ళీ స్పీచ్ స్టార్ట్ చేస్తాడు . దీంతో సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పేందుకు తడబడ్డాడ్డా..? లేక ఆ పేరు తర్వాత ఏపీ గురించి మాట్లాడడానికి తడబడ్డాడ్డా..?
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పి కొంతమేర సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడు అల్లు అర్జున్ . ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ అంటూ చెప్పారు . ఆ తర్వాత పర్సనల్ గా చెప్తున్న పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటూ చెప్పి థాంక్స్ చెప్పాడు . అయితే ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం పవన్ కళ్యాణ్ మామయ్య అవుతాడుగా ..? మరి బాబాయ్ అని ఎందుకు అన్నాడు ..? అంటూ చర్చించుకుంటున్నారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ని బాబాయ్ అని పిలవడమే అలవాటా..? లేకపోతే పుష్ప2 సక్సెస్ మీట్ లో ఎంజాయ్మెంట్లో వరుసలు కూడా మర్చిపోయాడా..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు బన్ని స్పీచ్ నీ వైరల్ చేస్తున్నారు కొంత మంది జనాలు..!