పుష్ప 2 లో కనిపించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. హిందీ ఇండస్ట్రీని షేక్ చేసింది..?

Pulgam Srinivas
అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అందాల ముద్దు గుమ్మ రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాలో పుష్ప ఇంటర్నేషనల్ స్మగ్లర్లతో కలిసి ఎర్ర చందనాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటాడు. అందులో భాగంగా ఒకరితో మీటింగ్ ను కూడా పెట్టుకుంటాడు. పైన ఆ మీటింగ్ కు సంబంధించిన ఫోటో ఉంది. అందులో స్మగ్లర్ పక్కన ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఇక ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో చాలా తక్కువ సమయం కనిపించిన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఆ బ్యూటీ ఎవరో అనేది తెలుసుకోవడానికి కొంత మంది చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే ఈ సన్నివేషంలో ఈ ఫోటోలో కనబడుతున్న అమ్మాయి ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

పై ఫోటోలో కనబడుతున్న అమ్మాయి మరొకరు కాదు ఆమె పేరు ఆంచల్ ముంజల్. ఈ ముద్దు గుమ్మ ఎన్నో హిందీ టెలివిజన్ కార్యక్రమాల్లో నటించింది. అలాగే పలు హిందీ సినిమాలలో కూడా నటించింది. చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లి తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ 2008 సంవత్సరంలో ధూమ్ మచావో ధూమ్ అనే పెప్ సిరీస్ లో నటించింది. 

ఆ తర్వాత 2010 వ సంవత్సరం ఈ బ్యూటీ వీ ఆర్ ఫ్యామిలీ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ తర్వాత అనేక సినిమాలలో నటించి హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: