రీల్ పోలీసులు కాదు .. రియల్ పోలీసులు.. అల్లు అర్జున్‌కు 4 గంటలు ఊహించని ప్రశ్నలు..!

Amruth kumar
థియేటర్లో మూడు గంటలకు కూర్చుని పుష్ప2 సినిమా చూడడం బాగుంటుంది .. ఎందుకంటే అది వినోదాన్ని ఇస్తుంది కాబట్టి .. అదే నాలుగు గంటలకు ఓ విచారణకు కూర్చుంటే మామూలుగా ఉండదు.. ఈ అనుభవం ఎలా ఉంటుందో మొదటిసారిగా చూసాడు అల్లు అర్జున్ .. అలియాస్ పుష్ప రాజ్. సంధ్య థియేటర్ ఘటనలో ఏ 11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ఈరోజు ఉదయం పోలీస్ విచారణకు చిక్క‌డ‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు .. దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులు అల్లు అర్జున్ ను విచారించారు.. ప్రధానంగా 20 ప్రశ్నలు దానికి అనుబంధ ప్రశ్నలతో ఓ క్వశ్చన్ పేపర్ సిద్ధం చేసినప్పటికీ ప్రధానంగా రెండు అంశాల పైన పోలీసులు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.

చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ .. నిందితుడు అల్లు అర్జున్ ను సుదీర్ఘంగా ప్రశ్నిస్తూ విచారించారు .. ఇక వీళ్ళ ప్రశ్నలు అన్ని ప్రధానంగా రెండు అంశాలపైనే ఉన్నాయి . . వీటిలో ఒకటి అల్లు అర్జున్ కు రేవతి మృతి విషయం ఎప్పుడు తెలిసింది .. థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడే రేవతి మరణించడం గురించి పోలీసులు చెప్పారా లేదా ? వీటిపై అల్లు అర్జున్ ను పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక రెండో ముఖ్యమైన అంశం .. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటన పై సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు .. అందులో తన క్యారెక్టర్ ను కించపరిచారని వ్యక్తిత్వ హ‌ననం చేశారని ఆయన అన్నాడు .. అలా ఎందుకు అనాల్సి వచ్చింది ? దానికి దారి తీసిన కారణాలు ఏంటి .. ఎవర్ని మీరు టార్గెట్ చేస్తూ ఆ మాటలు అన్నారు అంటూ ప్రశ్నించారు .. తన లాయర్ల సూచనల మేరకు చాలా ప్రశ్నలకు అల్లు అర్జున్ మాట్లాడకుండా ఉండిపోయినట్లు తెలుస్తుంది.

అలాగే పోలీసులు అల్లు అర్జున్ దగ్గర కేలిక వీడియోలు కూడా ప్రదర్శిస్తూ ఆయన విచారణ జరిపినట్టు తెలుస్తుంది .. అలాగే అల్లు అర్జున్ రాలీకి సంబంధించిన వీడియోను చూపించి కొన్ని ప్రశ్నలు అడిగారట .. వాటిపై కూడా అల్లు అర్జున్ గతంలో చెప్పిన సమాధానాలు ఇచ్చారట. అయితే సాక్షాలతో పాటు కొన్ని ఊహించని ప్రశ్నలు ఎదురవడంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా షాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ విచారణ కోసం పోలీస్ స్టేషన్లోనే ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారట .. ఇక దాంట్లోకి ఎవరు రావాలని నిబంధన కూడా పోలీసులు ముందుగానే పెట్టుకున్నారట .. అల్లు అర్జున్ ను అడిగే ప్రశ్నావళి కూడా కొంతమంది కనుసన్నలో మాత్రమే రూపొందించారట.  నిందితుడు అతనితో వచ్చిన లాయర్ల కోసం మంచినీళ్లు భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అక్కడ భోజనం చేయలేదు .. పోలీస్ విచారణ ముగించుకొని తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు .. అయితే విచారణ మధ్యలో కొన్నిసార్లు వాట‌ర్‌ తగడటం అలాగే కొంత స్నాక్స్ తిన్నాడట అవి కూడా ఇంటి నుంచి తెచ్చుకున్నవే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: