డాకు మహారాజ్'లో ఇండస్ట్రీ షేక్ అయ్యే సర్‌ప్రైజ్..ఏకంగా ఆ ఇద్దరు ?
అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పూర్తికాలేదు. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించలేదు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడు చేస్తారు అని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఇలాంటి సమయంలో మూవీ టీం నుంచి తాజాగా ఓ అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. డాకు మహారాజు సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లుగా మేకర్స్ నుంచి ప్రకటన వెలువడింది.
2025 సంక్రాంతి కానుకగా డాకు మహారాజు సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. అంతే కాకుండా సంక్రాంతికి రామ్ చరణ్ నుంచి రాబోతున్న గేమ్ చేంజర్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాల పోటీ తట్టుకోవడం కోసం డాకు మహారాజు సినిమా ను దర్శకుడు బాబి రూపొందించారనే వార్త వైరల్ అవుతుంది.
ఇందులో ఇద్దరు యంగ్ స్టార్ హీరోల గెస్ట్ అప్పి యరెన్స్ సినిమాకు చాలా స్పెషల్ గా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు లీకులు చేస్తున్నారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంది. ఇప్పటికే ఆ ఇద్దరు హీరోలకు సంబంధించి ఈ సినిమాలో షూటింగ్ పూర్తయిందట. కేవలం డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉందట. త్వరలోనే అది కూడా పూర్తి అవుతుందని మూవీ టీం నుంచి సమాచారం అందుతోంది. మరి సంక్రాంతి బరి లో ఏ హీరో సినిమా దూసుకుపోతోందో చూడాలి.