అక్షయ్ కుమార్ నుంచి రవితేజ వరకు 2024 లో భారీ డిజాస్టర్లు అందుకున్న హీరోలు వీరే..!

Amruth kumar
ఇప్పటికే రెండువాలు 2024 సంవత్సరం చివరి దశకు వచ్చింది .. ఈ సంవత్సరంలో ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి .. అలా వచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించాయి .. ఇక మన భారతీయ చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అగ్ర హీరోలుగా ఉన్న అక్షయ్ కుమార్ , సూర్య , రవితేజ వంటి హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి . ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.  ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ముందుకు బడే మియా చోటే మియా, సెల్ఫీ, ఖేల్ ఖేల్ మే ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని డిజాస్టర్ గా మిగిలాయి.  మరో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ 2024 లో వచ్చిన ఏకైన‌ సినిమా జిగ్రా ఇది కూడా డిజాస్టర్ గా మిగిలింది . 80 బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 30 కోట్ల కలెక్షన్లు రాబట్టి భారీ డిజాస్టర్ గా మిగిలింది.

సౌత్ స్టార్ హీరో సూర్య కూడా ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నటించిన మూవీ కంగువా.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాఫ్ అయింది . 350 కోట్ల బడ్జెట్ తో తెర్కక్కిన ఈ సినిమా.. కేవలం 100 కోట్లకు కలెక్షన్లు రాబట్టి సూర్య కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా మిగిలింది. బాలీవుడ్ మరో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా మేరీ క్రిస్మస్ సినిమాతో వచ్చి భారీ డిజాస్టర్ అందుకుంది. ఈ సినిమా కూడా 60 కోట్ల బడ్జెట్ తో వ‌చ్చింది. కేవలం ఈ సినిమా 26 కోట్ల కలెక్షన్లు కాబట్టి భారీ ఫ్లాప్ గా నిలిచింది. మరో ఇండియన్ స్టార్‌ హీరో కమలహాసన్ కూడా ఈ సంవత్సరం ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా తన ఖాతాలో వేసుకున్నాడు .. 250 కోట్ల బడ్జెట్ తో వ‌చ్చిన‌ సినిమా కేవలం 150 కోట్ల కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ మరో స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా వేద సినిమాతో హిట్‌ అందుకున్నామని ఎంత ట్రై చేసినా ఈ సినిమా 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 26 కోట్ల కలెక్షన్ సాధించి భారీ డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది.

మరో బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా ఐ వాంట్ టు టాక్ సినిమాతో ఈ సంవత్సరంలోనే అతిపెద్ద డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కేవలం కొట్టి రూపాయల కలెక్షన్లు మాత్రం ఈ సినిమా రాబట్టి అభిషేక్ బచ్చన్ కు భారీ నిరాశను మిగిల్చింది. టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఈ సంవత్సరం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ముందుగా ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా సంక్రాంతికి వచ్చి భారీ డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత.. మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా కూడా విడుదలైన తర్వాత నెగటివ్ టాక్‌ తెచ్చుకొని భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.  తెలుగు మరో స్టార్ హీరో గోపీచంద్ కూడా గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు .. ఇదే క్రమంలో ఈ సంవత్సరం భీమా , విశ్వం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. ఈ సినిమాలు కూడా గోపీచంద్ కు ఆశించిన ఫలితం అందించలేకపోయాయి.  తెలుగు మరో స్టార్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కూడా ఈ సంవత్సరం ది ఫ్యామిలీ మాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. ఈ సినిమా 50 కోట్ల బడ్జెట్ తో వ‌చ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం 19 కోట్ల కలెక్షన్లు కాబట్టి విజయ్‌కు సరైన హిట్ ఇవ్వలేకపోయింది. ఇలా ఈ ఏడాది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ స్టార్ హీరోలు నటించిన‌ సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: