
శోభిత ధూళిపాళ్ల తెలుగులో మిస్సయిన ఆ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఏంటో తెలుసా..? నాగచైతన్య సినిమాలోనే..!
అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగతన్య అక్కినేని అదేవిధంగా శోభిత ధూళిపాళ్ల పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు . పెళ్లికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే పెళ్లికి దూరంగా ఉంది అమల అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటి మూమెంట్లోనే శోభిత ధూళిపాళ్ల తెలుగులో మిస్ చేసుకున్న ఐటెం సాంగ్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య - నాగార్జున హీరోలుగా నటించిన "బంగార్రాజు" సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించడానికి ఆఫర్ వచ్చిందట శోభితకు. కానీ అప్పటికే శోభిత ధూళిపాళ్ళ నాగ చైతన్య రిలేషన్ షిప్ లో ఉన్నారు . ఆ విషయం కొంత మందికి మాత్రకే తెలుసు . ఆ కారణంగానే శోభిత ధూళిపాళ్ళ ఆఫర్ రిజెక్ట్ చేసిందట . అప్పటివరకు నాగార్జునకి ఆ విషయమే తెలియదు. అయితే నాగచైతన్య తన ప్రేమ విషయాన్ని బయటపెట్టినప్పుడు బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ ఒప్పుకోనిది అందుకేనా..? అంటూ ఆశ్చర్యపోయారట . ఫైనల్లీ శోభిత - నాగచైతన్య పెళ్లి చేసుకున్నారు . ఈ జంట ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ ఆశపడుతున్నారు జనాలు..!