పుష్ప-2 పై బ్రహ్మాజీ రివ్యూ.. చూడొద్దంటూ షాకింగ్ ట్వీట్..?

Pandrala Sravanthi
పుష్ప-2 సినిమాని కేవలం సామాన్య జనాలు,అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు. ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఈ సినిమాను వీక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే ఫస్ట్ రోజు దిల్ రాజు, అల్లు అర్జున్ ఫ్యామిలీ, రష్మిక,శ్రీ లీల, హరీష్ శంకర్,అట్లీ,రాంగోపాల్ వర్మ, డైరెక్టర్ క్రిష్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు సినిమాని చూసి ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. అయితే వీరందరితో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా పుష్ప-2  సినిమా చూసి సంచలన రివ్యూ ఇచ్చారు. మరి ఇంతకీ బ్రహ్మాజీ రివ్యూ ఏమని ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా..స్పెషల్ సాంగ్ లో శ్రీలీల ఫహద్ ఫాజీల్,జగపతిబాబు,రావు రమేష్, అనసూయ,సునీల్ ఇలా ఎంతోమంది భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప-2  సినిమా బాక్సాఫీస్ ని చెడుగుడు ఆడేసింది.

మొదటి రోజు 150 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి సంచలనం సృష్టించింది.ఇప్పటికే ఈ సినిమాను చూసిన ఎంతోమంది సెలబ్రిటీలు రివ్యూ ఇస్తూ సినిమా బ్లాక్ బస్టర్ 100 డేస్ పక్కా అంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చూసిన నటుడు బ్రహ్మాజీ సినిమాకి సంబంధించి సంచలన రివ్యూ ఇచ్చారు.బ్రహ్మాజీ పుష్ప-2 సినిమా చూసి సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేశారు. బ్రహ్మాజీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ...పుష్ప టు సినిమాకి సంబంధించిన రివ్యూలు ఎవరు నమ్మకండి చూడకండి.మీరు నేరుగా వెళ్లి థియేటర్లలో ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేయండి.అంతే కానీ రివ్యూలు మాత్రం అస్సలు చూడకండి.

 సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావడం పక్కా. ఈ సినిమా చూసాక స్టాండింగ్ ఓవేషాన్ కూడా ఇస్తారు.. అంటూ బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా సంచలన రివ్యూ ఇచ్చారు. ఇక ఈయన రివ్యూ చూసిన చాలా మంది నెటిజెన్లు కచ్చితంగా సినిమా చూడాలి అని టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే సినిమా చూసిన చాలామంది ప్రేక్షకుల్లో కొంతమందికి నచ్చితే కొంతమంది నచ్చలేదని చెప్తారు. అందుకే ఎవరి టేస్ట్ వారిది కాబట్టి సినిమా చూస్తే తప్ప ఆ సినిమా ఎలా ఉంది అనేది అర్థం కాదు అందుకే బ్రహ్మాజీ  ఈ విధంగా పోస్ట్ పెట్టారని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: