తెలుగు ఇండస్ట్రీలోనే అలా చేసిన ఏకైక స్టార్ అల్లు అర్జున్.. ఏ హీరో టచ్ చేయలేని రికార్డ్ ఇది..!

Thota Jaya Madhuri
వారెవ్వా ఏం చేశాడు రా బాబు ..ఇలా నటించిన హీరో నే లేడు.. ఒకటా రెండా ఇలా ఎన్నెన్నో కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్నాయి . దానికి కారణం పుష్ప2 సినిమా అని చెప్పుకోవడంలో సందేహం లేదు . మొదటి నుంచి పుష్ప2 పై బన్నీ చాలా ధీమాగా ఉన్నాడు . ఎంతలా అంటే ఈ సినిమాకు ఎవరు సపోర్ట్ చేసిన చేయకపోయినా తన ఫ్యాన్స్ తన ఆర్మీ చాలు అంటూ చాలా ధీమా వ్యక్తం చేశారు. అనుకున్న విధంగానే బన్నీ పుష్ప2తో బ్లాక్ బస్టర్ కాదు సినీ ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసే హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు .



1500 కోట్లు ఏం కర్మ 2000 కోట్లు దాటేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ప్రెసెంట్ పుష్ప2కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే . కొద్దిసేపటి క్రితమే రిలీజైన పుష్ప2 సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా బన్నీ నటన పర్ఫామెన్స్ అద్దిరిపోయే రేంజ్ లో ఉంది . అంతేకాదు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న జాతర ఎపిసోడ్ సినిమా రూపురేఖ అనే మాట చేసింది .



సినిమాను థియేటర్స్ లో చూడడానికి ఈ ఒక్క సీన్ చాలు అంటూ బన్నీ ఫాన్స్ అని చెప్తున్నారు . అంతేకాదు చీర కట్టుకొని బన్నీ ఏదో కేవలం నాలుగు స్టెప్స్ వేస్తాడు అనుకున్నామే కానీ ఈ రేంజ్ లో ఫైట్ సీన్స్ ఈ రేంజ్ లో అల్లాడించేస్తాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని .. నిజంగానే బన్నీ కెరియర్ లో ది బెస్ట్ సినిమా ఇదేనని.. ఇక బహుశా తన లైఫ్ లో ఇలాంటి సినిమా మరొకటి చేయలేకపోవచ్చు అంటూ బన్నీ ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఏ స్టార్ హీరో కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఒక రోల్ ని టచ్ చేయలేడు అని మరీ ముఖ్యంగా చీర కట్టుకొని ఆ విధంగా స్టెప్స్ వేయడం ఆ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం బన్నికి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ ఇది తెలుగు హీరోలలో ఎవ్వరు టచ్ చేయలేని రికార్డు అంటూ బన్నీని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ పుష్ప 2 కి సంబంధించిన రివ్యూస్ ఓ రేంజ్ లో అల్లాడించేస్తున్నాయి . మరి ఎందుకు ఆలస్యం మీ దగ్గరలోనే థియేటర్స్ లో టికెట్స్ బుక్ చేసుకుని ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: