పుష్ప 2 : పెళ్లాం మాట మొగుడు వింటే ఏకంగా సీఎంనే మార్చేయొచ్చా... పుష్ప గాడు అదే చేశాడు..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

ఒకడూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు.. వాడికి ఫైర్ అని చూపించి వచ్చా అంటాడు .. ఎవ్వడైనా రానియ్.. ఏదైనా కానియ్.. తగ్గేదేలే అస‌లాట ఇప్పుడే మొద‌లు పెట్టా అంటూ పెళ్లి పీట‌ల‌పై శ్రీ వ‌ల్లి మొడ‌లో తాళి క‌డుతూ ఫ‌స్ట్ పార్ట్ కి ఎండ్ కార్డు వేస్తాడు పుష్ప రాజ్‌. సెకండ్ పార్ట్ లో వైల్డ్ ఫైర్ చూపించేశాడు. అది ఏ రేంజ్‌లో ఉందంటే .. ‘‘ ఎవడ్రా బాస్.. ఎవడికి రా బాస్ ’’ ఈ ఒక్క డైలాగ్‌తో పుష్ప గాడి లో వాడీవేడీ దీనవ్వా తగ్గేదేలే అని ఎంట్రీ సీన్ తోనే ఫైర్ స్టార్ట్ చేసి ప‌డేశాడు. ప్ర‌తి ఒక్క ఆడియెన్ కూడా మ‌నం చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు .. వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు పుష్ప గాడు. ఇక ఏ సినిమాకి అయినా కథే హీరో. ఎంతపెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శకధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే అన‌క త‌ప్ప‌దు.


కానీ పుష్ప - 2 కథానాయకుడి రూలింగ్‌నే కథగా మలిచాడు మ‌న లెక్క‌ల మాస్టారు సుకుమార్. ‘పెళ్లం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో పపంచానికి చూపిస్తా’ అని పుష్ప ట్రైలర్‌‌లో చెప్పాడు.. అది కేవ‌లం డైలాగ్ మాత్ర‌మే కాదు .. అదే అసలు కథ.. పుష్ప ది రూల్ కథకి మూలం అది. పుష్ప రాజ్ ( అల్లు అర్జున్ ) తన భార్య శ్రీవల్లి ( రష్మిక ) కి ఇచ్చిన మాట కోసం ఏకంగా సీఎంనే మార్చేస్తాడు. ఇది విన‌డానికి చాలా కామెడీగా ఉంటుంది. అయితే సీఎంతో మాట కోసం అస‌లు పుష్ప గాడు ఎంత దూరం వెళ్లాడు ? పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేతంట రూలింగ్ చేసి ఏకంగా రాష్ట్ర రాజకీయాలను ఏవిధంగా శాసించాడు ? పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షేకావత్ ( ఫహాద్ ఫాజిల్ )తో ఢీ కొట్టి.. తన నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు ?   ఇవ‌న్నీ చూస్తుంటే గూస్ బంప్స్ వ‌చ్చేస్తుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: