పుష్ప-2 : ఆ ఒక్క సీన్ తో.. బన్నీ ఫ్యాన్స్ రోమాలు నిక్కబోడుచున్నాయిగా?

praveen
అల్లు అర్జున్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పుష్ప-2 సినిమా రిలీజ్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అవ్వగా ఇక మిడ్ నైట్ షోలు కూడా చూసేందుకు ప్రేక్షకులకు ఆసక్తిని కనపరిచారు. ఇప్పటికే థియేటర్కు వెళ్లి సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో చూపించిన నట విశ్వరూపం చూసి మైమరచిపోతే.. ఇక సినిమా చూసేందుకు రెడీ అవుతున్న ప్రేక్షకులు.. ఈ మూవీ టాక్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.


 ఈ క్రమంలోనే థియేటర్లో పుష్ప గాడి విలయతాండవం చూసి మైమరిసిపోతున్నారు. మూడేళ్ల నిరీక్షణకు పుష్ప-2 సినిమాతో ఇప్పుడు ఫుల్ మిల్స్ కాదు ఏకంగా బిర్యాని పెట్టినంత కడుపు నిండిపోయింది అంటూ ఇక ఈ సినిమా చూశాక ప్రతి అభిమాని కూడా ఆనందంతో గంతులు వేస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ అయితే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి అనడంలో సందేహం లేదు. పుష్ప మొదటి పార్ట్ లో పోలీస్ స్టేషన్ కు వెళ్లి పెళ్లి కార్డు ఇవ్వడానికి పుష్ప ప్రయత్నించిన సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన ఫహద్ ఫాసిల్ ఏకంగా పుష్పాకే వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత పెళ్లికి మరికొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉందన్నప్పుడు పుష్ప ఫహద్ ఫాసిల్ పై ఎలా రివెంజ్ తీర్చుకుంటాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఇక ఈ రివేంజ్ సీక్వెన్స్ చూసినప్పుడు అభిమానుల కి గూస్ బంప్స్ వచ్చాయి. అయితే ఇలాంటి రివేంజ్ సీన్ పుష్ప 2 లో కూడా ఉంది అన్నది తెలుస్తుంది. ఒకానొక సమయంలో ఫహద్ ఫాసిల్ కు సారీ చెప్పి ఆవేదనతో రగిలిపోయి వెనక్కి వచ్చే సీన్ ఉంటుంది. అయితే పుష్ప సారీ చెప్పి వెనక్కి తగ్గాడంటే ఎక్కడో రివెంజ్ ప్లాన్ చేశాడని అభిమానులు అనుకుంటారు. ఇక ఆ తర్వాత ఫహద్ ఫాసిల్ ను స్విమ్మింగ్ ఫూల్ లోకి తోసి మరి అదే నీటిలో యూరిన్ పోస్తాడు పుష్పరాజ్. ఇక ఈ సీన్ కి అటు అభిమానుల రోమాలను నిక్కబడుచుకున్నాయి. విజిల్స్ మోతతో థియేటర్ దద్దరిల్లింది. అసలు సుకుమార్ కు వచ్చిన ఈ ఆలోచన అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ అనుకున్నారు. పుష్పగాడికి మండితే.. సారీ చెబితే ఎలా ఉంటుందో ఈ ఒక్క సీతో సుకుమార్ చూపించాడు అంటూ ఫ్యాన్స్ విజిల్స్ వేశారు. పహాడ్ ఫాజల్ కు కౌంటర్గా దమ్ముంటే పట్టుకోరా అంటూ తొడ విరిచి సవాల్ చేయటం అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: