'ఢీ' జడ్జిగా వచ్చిన విజయ్ బిన్నీ.. నాగార్జున హిట్ మూవీ డైరెక్టర్ తెలుసా?
అయితే ఇక ఇప్పుడు 17వ సీజన్ కూడా ప్రారంభం కావడానికి సిద్ధమైంది. ఇక ఈసారి జోడిలో డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించబోతున్నారు. అయితే శేఖర్ మాస్టర్ ప్లేస్ లో విజయ్ బిన్నీ మాస్టర్ ఢీ 17వ సీజన్ కి జడ్జిగా వచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే 17వ సీజన్ కు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ స్థానంలో జడ్జిగా వచ్చిన విజయ్ బిన్ని ఎవరు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. కాగా విజయ్ బిన్ని ఎవరో కాదు నాగార్జునతో సూపర్ హిట్ మూవీ తీసిన సినిమాకి డైరెక్టరట. ఆ సినిమా ఏదో కాదు నా సామి రంగ. వాస్తవానికి విజయ్ బిన్ని కొరియోగ్రాఫర్ అన్న విషయం తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పని చేశారు.
అయితే డైరెక్టర్ అవ్వాలనుకున్న విజయ్ బిన్ని ఒక కథతో నాగార్జున దగ్గరికి వెళ్ళాడట. ఎప్పుడు కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసే నాగార్జున కొరియోగ్రాఫర్ అయిన విజయ్ బిన్నీ పై నమ్మకం ఉంచి నా సామీరంగా సినిమా చేసేందుకు ఓకే అన్నాడట. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా చూశాక.. కొరియోగ్రాఫర్స్ కి అన్ని క్రాప్స్ట్ పై గ్రిప్ ఉంటుందని భావించి కొరియోగ్రఫీ నుండి డైరెక్టర్ గా మారాడట. ఇక నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ నాగార్జునతోనే సంక్రాంతి బుల్లోడు పేరుతో మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు విజయ్ బిన్ని. ఇక ఇప్పుడు డి షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా మరింత దగ్గరయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. మరి తన జడ్జిమెంట్ తో ఎలా ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.