బన్నీ వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్: ఎవరికి మేలు..? ఎవరికి బొక్క..?
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా వెర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య వార్ మరింత హిట్ పెంచేసింది . అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా హిట్ అయితే మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే అల్లు అర్జున్ హిట్ కొట్టాడు అని బన్నీ ఫాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతారు . అందులో నో డౌట్ . ఒకవేళ సినిమాకి అటూ ఇటూ టాక్ వస్తే.. కష్టపడి బన్నీ నటించిన మెగా ఫ్యాన్స్ కావాలని తొక్కేశారు అనే విధంగా కామెంట్స్ వినిపిస్తాయి. అది అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు పుష్ప సినిమా హిట్ అయితే మెగా ఫ్యాన్స్ కి నష్టమా..? లాభమా..? అదేవిధంగా పుష్ప సినిమా ఫ్లాప్ అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నష్టమా..? లాభమా..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది .
అంతేకాదు కొంతమంది అల్లు వర్సెస్ మెగా ఫాన్స్ వార్ లో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే విషయాలు మాట్లాడుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో సాయిధర్మతేజ్ - వరుణ్ తేజ్ - పంజా వైష్ణవ్ తేజ్ టైర్ 2 హీరోల కిందకి వస్తారు . బిగ్ బడా హిట్స్ కొట్టింది తక్కువ . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఇప్పుడు మెగా ట్యాగ్ ని నిలబెట్టాలి. అయితే మెగాస్టార్ చిరంజీవి వయసు అయిపోతుంది ఈ మధ్య కాలంలో మెగాస్టార్ హిట్స్ కొట్టిందిలేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా బిజీ ఇకపై సినిమాలో కనిపిస్తాడు అన్న ఆశలు కూడా లేవు . మిగిలింది రామ్ చరణ్ .
రామ్ చరణ్ ఒక్కడి పైనే మెగా బాధ్యతలు ఉన్నాయి . గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయితే అది కూడా సగం డౌన్ ఫాల్ అయిపోతుంది . ఇప్పుడు బన్నీ విషయానికొద్దాం . బన్ని నటించిన పుష్ప సినిమా ఫ్లాప్ అయినా కూడా కచ్చితంగా పెట్టిన దానికి వసూలు రాబట్టేసుకుంటుంది . ఆ రేంజ్ లోనే పబ్లిసిటీ చేసుకున్నారు. మరి ముఖ్యంగా జాతర సీన్ ఎపిసోడ్ సూపర్ హైలైట్ గా మారిపోతుంది అంటూ చాలామంది ప్రముఖులు చెప్పారు. ఒకవేళ పుష్ప సినిమా అటూ ఇటూ టాక్ దక్కించుకున్న బన్నీ నెక్స్ట్ కెరియర్ కి ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక కథను ఫైనలైజ్ చేసుకున్నారు . ఆ తర్వాత బన్ని లిస్టులో బడా బడా డైరెక్టర్స్ ఉన్నారు . బన్నీకి ఒక రెండు మూడు ఫ్లాపులు పడినా కూడా మళ్లీ ఆ స్టామినా దక్కించుకుని..ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకునే సత్తా ఉంది . కానీ రామ్ చరణ్ అలా చేయగలడా..? మళ్లీ మగధీర ,RRR లాంటి సినిమాలు తన ఖాతాలో వేసుకోగలడా ..?అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . దీంతో పుష్పని ఒక పేరులా కాకుండా ఒక బ్రాండ్ లా మార్చేయబోతున్నారు బన్ని అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???