పుష్ప 2 క్లైమాక్స్ కి .. అసలు బిజిఎం ఇచ్చింది ఎవరంటే..?

Amruth kumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెర్కక్కిన పుష్ప2 సినిమాను అందరూ ఎప్పుడెప్పుడు చూస్తామని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ క్రేజీ సీక్వెల్‌ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసింది .. ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మిలియన్ కొద్దీ వ్యూస్ తో సోషల్ మీడియాలో వైరల్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇక రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్లో దేవిశ్రీప్రసాద్ ని ఉద్దేశిస్తూ సుకుమార్ మాట్లాడుతూ డీఎస్పీ ఐ లవ్ యు .. ఎవరైనా నా జీవితంలోకి వచ్చారంటే వారితో నా జర్నీ అలా కొనసాగుతూనే ఉంటుంది .. నేను ప్రేమించే వారితో ప్రేమతోనే వర్క్ చేయగలను .. డార్లింగ్ ఐ లవ్ యు సో మచ్ .. నువ్వు క్లైమాక్స్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం .. నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకువెళ్లావ్ థాంక్యూ సో మచ్ అని   అన్నారు .. ఇక దీంతో పుష్ప 2 క్లైమాక్స్ కి దేవిశ్రీ బిజీఎం ఇచ్చినట్లు అందరికీ కన్ఫర్మ్ అయింది .. ఇక అయితే ఇప్పుడు మరో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా పుష్ప 2 క్లైమాక్స్ కోసం వర్క్ చేసినట్లు ట్వీట్ చేయడంతో మరో గందరగోళం ఏర్పడింది.

 ఇది నాకు అద్భుతమైన ప్రయాణం నన్ను పరిగణలోకి తీసుకున్నందుకు మరియు బీజీఎంలో పనిచేసిన ఈ అద్భుతమైన అనుభవాన్ని నాకు ఇచ్చినందుకు మైత్రి మూవీ వారికి ధన్యవాదాలు .. అల్లు అర్జున్ సార్ కి కూడా ధన్యవాదాలు .. మీకు బిజిఎం స్కోర్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది .. ఇక ఇది నిజంగా ఫైర్ .. సుకుమార్ సార్ తో కలిసి వర్క్ చేసినందుకు నేను ఎంతో గ్రేటుగా ఫీల్ అవుతున్నాను .. ముఖ్యంగా ఈ పవర్ ఫ్యాక్ ఫైట్ సీన్స్ క్లైమాక్స్లో పనిచేయడం ఒక భిన్నమైనన అనుభవం .. నాకు మద్దతుగా నిలిచిన ఎడిటర్ సినిమా యూనిట్ అందరికీ నా ధన్యవాదాలు.. దీనికి డిఎస్పిని మినహ‌ మిగతా అందరిని టాగ్ చేశాడు. ఇక పుష్ప 2 క్లైమాక్స్ కి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ ఇచ్చాడని సుకుమార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన తర్వాత ఇప్పుడు తాను కూడా క్లైమాక్స్ కి వర్క్ చేసినట్లు సామ్ సీఎస్ పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .. ఇక నిజానికి పుష్ప 2 సినిమా కోసం దేవిశ్రీ తో పాటు  ఎస్. థమన్ , సామ్ సీఎస్ , అజనీష్ లోక్ నాథ్ వంటి మరో ముగ్గురు మ్యూజిక్ దర్శకులు వర్క్ చేశారు .. అయితే సినిమా మొత్తానికి కాకుండా ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్లకు మాత్రమే బ్యాగ్రౌండ్ స్కోర్ చేసినట్లుగా తమన్ క్లారిటీ ఇచ్చారు.

 ఇక సినిమాలో జాతర ఫైట్ కి బిజిఎం ఇచ్చినట్లుగా క్లారిటీ ఇస్తూ సామ్ సీఎస్ ఇటీవల పోస్ట్ పెట్టాడు .. ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ కి కూడా తనే చేసినట్లుగా చెబుతున్నాడు.. 'పుష్ప 2' క్లైమాక్స్‌కి సామ్ సీఎస్ బీజీఎమ్ కంపోజ్ చేస్తే , దేవిశ్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లుగా స్వయంగా డైరెక్టర్ సుకుమారే ఎందుకు చెప్తాడు? ఇంతకీ ఇద్దరిలో ఎవరు వర్క్ చేసారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. సినిమాలో జాతర సీక్వెన్స్ హైలైట్ గా నిలవబోతోందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అలాంటి కీలకమైన ఎపిసోడ్ కి సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసినప్పుడు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరూ ఆయన పేరుని ఎందుకు ప్రస్తావించలేదు? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్ క్రెడిట్ మొత్తం దేవిశ్రీ ప్రసాద్ కి ఇస్తున్నందుకే సామ్ ఈ ట్వీట్ పెట్టి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం క్లైమాక్స్‌కి సామ్ వర్క్ చేసినప్పటికీ , చివరకు దేవిశ్రీ కొట్టిన బీజీఎమ్ నే ఉంచారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.పుష్ప 2 సినిమాకి ఎవరు వర్క్ చేశారు అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే .. టైటిల్ కార్డ్స్ లో ఎవ‌రి పేర్లు కనిపిస్తే వాళ్ళు ఇచ్చిన ఆర్ఆర్ సినిమాలో ఉన్నట్లు అలాకాకుండా క్రెడిట్స్‌లో దేవిశ్రీ ప్రసాద్ పేరు మాత్రమే ఉంటే ఆయనే సినిమాకి సోలో మ్యూజిక్ డైరెక్టర్ అని భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: