సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న విషయం మీడియాలో వైరల్ అయినా కూడా దానిపై తెగ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు.ఇక ఈ మీమర్స్, ట్రోలర్స్ దెబ్బకి స్టార్ సెలబ్రిటీలైతే తల పట్టుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా యాంకర్ అనసూయ పై అలాంటి ట్రోలింగే జరిగింది. మరి ఇంతకీ అనసూయ చేసిన తప్పేంటి..ఆమెపై ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.. యాంకర్ అనసూయ పుష్ప పార్ట్ వన్ లో ద్రాక్షాయణి అనే విలన్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె పాత్ర పుష్ప -2 లో కూడా కంటిన్యూ అవుతుంది.
అయితే మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న పుష్ప-2 మూవీకి సంబంధించి హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరిపించారు.అయితే ఈ వేడుకలకి పుష్ప -2 చిత్రయూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి కూడా వచ్చి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడుతున్న రాజమౌళి సడన్ గా డిఎస్పీని పొగిడారు. అయితే అక్కడే ఉన్న దేవి శ్రీ ప్రసాద్ తనని అంత పెద్ద డైరెక్టర్ పొగుడుతున్నాడు అని చాలా ఆసక్తికరంగా వింటున్నాడు.
కానీ అదే టైంలో ఆయన పక్కనే కూర్చున్న యాంకర్ అనసూయ రాజమౌళి స్పీచ్ డిఎస్పీ ని విననివ్వకుండా ప్రతిసారి డిస్టర్బ్ చేస్తుంది. అయితే తన గురించి రాజమౌళి పొగుడుతూ ఉంటే ఎంతో ఆనందంగా వింటున్న డిఎస్పిని అనసూయ డిస్టర్బ్ చేయడంతో ఆయన కాస్త చిరాకు గా ఫేస్ పెట్టి ఈవిడేటి మధ్యలో అన్నట్లుగా చూశాడు. అయితే ప్రస్తుతం ఈ ఫొటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టడంతో కొంతమంది జనాలు అనసూయ పై ట్రోల్స్ మీమ్స్ చేస్తున్నారు. పానకంలో పుడకలా నువ్వేంటే అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం అనసూయ పై మెడిసిన్స్ చేసే ట్రోల్స్ మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.