హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న విలన్.. ఇంతకీ ఎవరో తెలుసా?
ఎందుకంటే ఇక సినిమాలోని తారాగణం మొత్తంలో హీరోకి ఎక్కువ మొత్తంలో పారితోషకం అందించిన తర్వాతే ఇతర నటీనటులకు తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం చూస్తూ ఉంటాము. హీరో తర్వాత హీరోయిన్ ఆ తర్వాత విలన్ ఆ తర్వాత అదే సినిమాలో నటిస్తున్న స్టార్ నటీనటులకు పారితోషకం అందించడం చూస్తూ ఉంటాం. కానీ హీరోకి మించి విలన్ ఎక్కువ పారితోషికం తీసుకోవడం మాత్రం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక నటుడు మాత్రం ఇలా హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.
బాలీవుడ్ లో తొలి తరంలో స్టార్ విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు ప్రాన్. 1940లలో కొన్ని పంజాబీ, హిందీ సినిమాల్లో హీరోగా కెరియర్ ని మొదలుపెట్టిన ఆయన హీరోగా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. ఇలా హీరోగా సక్సెస్ రాకపోవడంతో విలన్ అవతారం ఎత్త్తాడు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వెండితెరపై తిరుగులేని విలనిజాన్ని పండించి ప్రేక్షకులు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. రామ్ ఔర్ శ్యామ్, మధుమతి, జిస్ దేశ్ మే గంగా బహతీ హై, కాశ్మీర్ కి కాళీ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక 1960 దశకంలో ఏకంగా హీరోల కంటే ఎక్కువ పారితోషకం పుచ్చుకున్నాడట ఆయన. 1968లో సినిమా బడ్జెట్ పది నుంచి 20 లక్షలు దాటని సమయంలో ఏకంగా ప్రాన్ ఐదు నుంచి పది లక్షల దాకా పారితోషకం తీసుకున్నాడట. అప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఎంతో మంది స్టార్ హీరోలను మించి ఈయన పారితోషకం తీసుకున్నాడు. ప్రాన్ సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత అమితాబచ్చన్ ఒక్కో సినిమాకి 12 లక్షలు తీసుకొని అత్యధిక పారితోషకం తీసుకున్న నటుడిగా నిలిచారు.