సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటూ ఉంటారు. మరి కొంత మంది మాత్రమే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నాక కూడా చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా .? ఆమె కోలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది.
అందులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి అవకాశాలను దక్కించుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక ప్రస్తుతం ఆ బ్యూటీ తెలుగు కంటే కూడా తమిళ సినిమాల్లో నటించడానికి అత్యంత ఎక్కువ ఆసక్తిని చూపుతుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే కోలీవుడ్ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమె కొన్ని రోజుల క్రితమే ఓ 1000 కోట్ల కలెక్షన్లను అందుకున్న ఓ సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. మరి పైన ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా .? ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.
ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల ద్వారా క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు లో కూడా అద్భుతమైన స్థాయి కి చేరుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగు కంటే తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తుంది. కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ హీరో గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.