పుష్ప 2 : బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది ఆ మ్యూజిక్ డైరెక్టరే.. సుకుమార్ కామెంట్స్ వైరల్..!!

murali krishna
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీ చాలా రకాలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ టీమ్ చేస్తున్న ప్రతీ ప్రమోషనల్ ఈవెంట్ భారీగా సక్సెస్ అవుతోంది. వీటి వల్ల సినిమాపై హైప్ కూడా క్రియేట్ అయ్యింది. అలాగే ‘పుష్ప 2’ టీజర్, ట్రైలర్‌కు ఎంత రీచ్ వచ్చిందో.. ఇందులోని పాటలకు కూడా అదే విధంగా రీచ్ వచ్చింది. ‘పుష్ప 2’ నుండి ఒక పాట విడుదలయితే చాలు.. అది వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గత రాత్రి భారీ స్థాయిలో నిర్వహించారు. భారీ జనసందోహం నడుమ జరిగిన ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ నుద్దేశిస్తూ ఈ సినిమా క్లైమాక్స్ కు ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అని అన్నారు. ఈ కామెంట్స్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ విషయం తెలుస్తోంది. ఇటీవల పుష్ప 2 సినిమాకు తమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్ నాధ్ లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిరని రకరాలుకాగా వినిపించింది. కానీ తమన్ వర్క్ చేసిన పోర్షన్ సుకుమార్ కు నచ్చలేదని పక్కన పెట్టేశారని కూడా వార్తలు వచ్చాయి. ఇక జాతర ఎపిసోడ్ కు సామ్ సీఎస్ చేసిన మ్యూజిక్ అద్భుతంగా అనే టాక్ కూడా నడిచింది. ఇప్పుడు సుకుమార్ చేసిన కామెంట్స్ తో వాళ్లెవరు కాదని దేవి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నే ఉంచినట్టు అర్ధం అవుతోంది. క్లైమాక్స్ పోర్షన్ దాదాపు 25 నిముషాలు సాగనుంది. మరి ఇతరులు చేసిన సంగీతాన్ని తీసుకున్నారా లేదా అనేది సినిమా రిలీజ్ అయితేగాని క్లారిటీ రాదు.ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: