డాన్ లను ప్రేమించిన హీరోయిన్లు .. జాక్వెలిన్ నుంచి మమతా కులకర్ణి వరకు లిస్ట్ చాలనే ఉందిగా ..!
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ తో ముడిపడి ఉంటుంది.. సుఖేష్ అరెస్టు తర్వాత వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు బయటికి వచ్చాయి. మరో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మోనికా బేడి కూడా గ్యాంగ్ స్టార్ అబూ సలేం పేరుతో ముడిపడి ఉంటుంది .. అతనితో సంబంధం కారణంగా ఈమెను పోలీసులు అరెస్టు కూడా చేశారు. మరో సీనియర్ హీరోయిన్ మందాకిని అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం గురించి కూడా గతంలో ఎన్నో రూమర్లు వచ్చాయి .. దీంతో ఈమెను అప్పట్లో సినిమాల నుంచి బ్యాన్ చేశారు.
మరో హీరోయిన్ మమతా కులకర్ణి పేరు కూడా మాదక ద్రవ్యాల అధిపతి విక్కీ గోస్వామి తో ముడిపడి ఉంటుంది ఆమె .. గతంలో డ్రగ్ కేసులో కూడా అరెస్టు అయింది. అనిత అయూబ్ పేరు కూడా ఈ జాబితాలోకి వస్తుంది ఈమె దావూద్ ఇబ్రహీం తో రిలేషన్ కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరో నటి జాస్మిన్ ధున్నా కూడా గ్యాంగ్ స్టార్ దావు ఇబ్రహీంతో సంబంధం కలిగి ఉంది .. ఈ ఆరోపణ వల్ల ఈమె భారతదేశం నుంచి వెళ్లిపోయింది. ఇలా వీరే కాకుండా ఎంతో మంది హీరోయిన్లు సినిమాల్లో నటించి కొంత కాలం తర్వాత ఇలా గ్యాంగ్ స్టార్లతో సంబంధాలు పెట్టుకుని చిత్ర పరిశ్రమ నుంచి దూరమయ్యారు ..