ఒకే సంవత్సరంలో 35 సినిమాల్లో నటించిన స్టార్ హీరో.. ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు..!

Amruth kumar
ఇక మన భారతీయ సినీ పరిశ్రమ లో సౌత్ నటులకు ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుందనే విషయం అందరికీ తెలుసు .. తెలుగు నుంచి ఎన్టీఆర్ , తమిళంలో ఎంజీఆర్ , మలయాళం లో నేడుముడి వేణు , కన్నడలో రాజ్ కుమార్ వంటి వారు భారతీయ సిని పరిశ్రమలో అగ్ర నటులుగా చిత్ర పరిశ్రమను ఏలారు . ఇప్పటికీ ప్రపంచ వేదికపై భారతీయ సినిమా విషయానికి వస్తే సౌత్ నటులకు ఎప్పుడు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది . ఇక ఆ కోవులోనే 1971 లో మలయాళ సినిమాల ద్వారా పరిచయమైన నటుడు ముమ్ముట్టి ..

సిని పరిశ్రమ లో అడుగుపెట్టినప్పుడు ఆయన వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే ప్రారంభం లో పెద్దగా అవకాశాలు రాకపోయినా... 1981 తర్వాత మలయాళ సినిమాలు ఆయన ఆధీనం లోకి వచ్చేయని చెప్పడం లో ఎలాంటి సందేహం  లేదు . దాదాపు 50 సంవత్సరాలు గా మలయాళ సిని పరిశ్రమ లో సూపర్ స్టార్ గావెలుగుతున్నారు .. తమిళంలో మధు దర్శకత్వంలో వచ్చిన  "మౌనం సమ్మతం" సినిమా ద్వారా భారీ విజయం అందుకుని కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు .. అలాగే తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశారు మమ్ముట్టి .

హిందీ , తెలుగు , తమిళం , మలయాళం ఇలా నాలుగు భాషల్లోనూ ప్రెసెంట్ బిజీగ ఉన్న నటుడుగా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పటికే 2024 లో ఆయన నటించిన 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .. మరో సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. అంతేకాకుండా 2025లో విడుదల కానున్న మూడు సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఇప్పటికీ కొత్త కథలను ఎంచుకుని నటిస్తున్న మమ్ముట్టి, 1985లో మలయాళంలో విడుదలైన 35 సినిమాల్లో నటించారు. వీటిలో దాదాపు 95% సినిమాల్లో ఆయనే హీరో. ఇదే విధమైన రికార్డును మరికొందరు నటులు కలిగి ఉన్నప్పటికీ, పారితోషికం, సినిమా పరిమాణం పరంగా మమ్ముట్టి అగ్రస్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: