"బాలయ్య ఆ ప్రశ్న కచ్చితంగా అడుగుతాడు..ఆ అన్ స్టాపబుల్ షో కి రాను"..తెలుగు హీరో షాకింగ్ కామెంట్స్..!?
బాలయ్య చాలా సరదా సరదాగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా ఏ హీరో కూడా హర్ట్ కాకుండా ఉండే విధంగానే ప్లాన్ చేస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు కూడా కొందరు హీరోస్ కి ఇబ్బందికరంగా మారుతూ వస్తాయి . తాజాగా అల్లు అర్జున్ ని హీరోయిన్స్ విషయంలో ప్రశ్నించిన తీరు కొంతమందికి నచ్చలేదు. డ్యాన్స్ లో నువ్వే నెం 1 అనే విధంగా ప్ర్శ్నించిన తీతు కూడా బన్నీ పై ట్రోల్లింగ్ జరిగేలా చేసింది.
ఇదే క్రమంలో బాలయ్య షో కి గెస్ట్ గా ఒక తెలుగు హీరోని ఆహ్వానిస్తే ఆ హీరో రానే రాను అంటూ చేతులెత్తిసాడట . ఆ హీరో మరెవరో కాదు నితిన్ . నితిన్ నటించిన "రాబిన్ హుడ్" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో కి రావాల్సి ఉంది . కానీ బాలయ్య కచ్చితంగా కెరియర్ కి సంబంధించిన గ్యాప్ ప్రశ్నిస్తాడు అన్న కారణంగా నితిన్ షోకే రాను అంటూ చేతులెత్తేసాడట . అంతేకాదు వేరే పనిలో బిజీగా ఉన్నాను అంటూ బాలయ్య లాంటి స్టార్ హోస్ట్ చేస్తున్న షో కి రాను అంటూ తెగ్గేసి చెప్పేసాడట.
అయితే హీరోయిన్ శ్రీలీ నే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోలో ఇన్వాల్వ్ చేశారు . శ్రీలీల తో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సైతం ఈ షోలో సందడి చేశారు . వీళ్లిద్దరి మధ్య జరిగిన కామెడీ చాలా చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది అంటూ రిలీజ్ అయిన గ్లింప్స్ ఆధారంగా తెలుస్తుంది . మొత్తానికి నితిన్ - బాలయ్య దెబ్బకి భయపడ్డాడు అంటూ కొంతమంది నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . చూడాలి మరి రాబిన్ హుడ్ సినిమా ఏ విధంగా హిట్ అవుతుందో..? ఇకనైనా నితిన్ కెరియర్ని ట్రాక్ లో పడేలా చేస్తుందో లేదో..?