పుష్ప 2 కు షాక్...అల్లు-మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన నాగబాబు..!
ముంబై జియో వరల్డ్ డ్రైవ్ లో ఉన్న పీవీఆర్ మైసన్ లో టికెట్ ధర రూ. 3వేలు చూపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ థియేటర్లలో టికెట్ ధరలు అంత పెట్టడానికి కారణం ఏంటంటే... జియో వరల్డ్ డ్రైవ్ లోని సినిమాస్ పూర్తి లగ్జరీ వాతావరణంతో కూడుకొని ఉంటుంది. ప్రతి సినీ అభిమాని సీట్లలో సౌకర్యవంతంగా కూర్చోవడానికి వీలుగా స్క్రీన్స్ ను బట్టి ఓపస్ గ్రైడ్ రెక్లయినింగ్ సీట్లను అమర్చారు రూ. 3000 టికెట్ ధర ఉన్న స్క్రీన్లలో మాత్రం వేరోనా జీరో వాల్ సీట్లను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.... టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్, అల్లు అంటూ పెద్ద ఎత్తున రచ్చ అవుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలే వాళ్లు మెగా అంటూ గొడవలు జరుపుతున్న నేపథ్యంలో మధ్యలో స్వామి వివేకానంద చెప్పిన ఒక విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు నాగబాబు. దీంతో ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఇలా చేసినట్లుగా అంటున్నారు.
ఇప్పటికే చాలా ఆలస్యమైందని తెలిపారు. మీరు తప్పు మార్గంలో ఉన్నారు అని వివరించారు. దానిని గుర్తించి వెంటనే మీ తప్పును సరిదిద్దుకోవాలని కోరాడు. లేకపోతే మళ్ళీ మీరు మా మూలాలను కలుసుకోవడం కష్టం అవుతుంది" అంటూ పరోక్షంగా నాగబాబు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నాగబాబు చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారాయి. ఇక అల్లు అర్జున్ అభిమానులు మళ్లీ ఈ పోస్ట్ చూసి పెద్ద రచ్చ చేస్తున్నారు.