టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో స్టార్ హీరోలు ఒకరిని చూసి మరొకరు తమ హిట్ సినిమాలను మరోసారి 4k వెర్షన్లో అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఖుషి, మురారి, పోకిరి, ఇంద్ర సినిమాలు రీ రిలీజ్లోనూ మంచి వసూళ్లు సాధించడంతో ఈ కోవలో మరిన్ని చిత్రాలు వస్తాయని భావిస్తున్నారు. హీరోల బర్త్ డేలు, లేదంటే ఆయా హిట్ చిత్రాల ల్యాండ్ మార్క్ ఇయర్స్‌ను పురస్కరించుకుని రీరిలీజ్‌లతో దిగుతున్నారు.ఇదిలాఉండగా .. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తన నటన, స్టైల్, మేనరిజంతో పవర్‌స్టార్‌గా ఎదిగారు పవన్ కళ్యాణ్. వరుసగా పదేళ్లు ఫ్లాపుల్లో ఉన్నా స్టార్డమ్ తగ్గకపోగా మరింత పెరిగిన అరుదైన ఘనత పవన్ సొంతం. అలాంటి పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్‌కు ప్రత్యేక స్థానముంది. రకరకాల సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ ఒక్క హిట్ కూడా కొట్టకపోవడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.ఈ దశలో పవన్ అభిమానులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది గబ్బర్ సింగ్.
ఈ సినిమా వచ్చే అప్పుడే 12 ఏళ్లు గడుస్తుందంటే ఆశ్చర్యం కలగకమానదు. పుష్కరకాలం క్రితం మండుటెండలో మే 11, 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా చూపించి వారి ఆకలిని తీర్చారు హరీష్ శంకర్. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారు హరీశ్ శంకర్. తొలుత ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో నాగబాబు తీయాలనుకున్నారు , అయితే అప్పటికే ఆరెంజ్ మూవీతో నష్టాల్లో ఉన్నందున బండ్ల గణేష్ చేతికి గబ్బర్ సింగ్ దక్కింది. అసలే ఆయన పవన్ కళ్యాణ్ భక్తుడు కావడంతో ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించారు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.79 కోట్ల వసూళ్లను సాధించింది. 306 కేంద్రాల్లో 50 రోజులు 65 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పవన్ స్టామినా ఏంటో నిరూపించింది.
ఇదిలావుండగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ చేయగా మొదటి రోజు సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది.ఈ క్రమంలో గబ్బర్ సింగ్4K రీ రిలీజ్ మొదటి రోజు రూ.6.51 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసి టాలీవుడ్ రీరిలీజ్ లలో అత్యధిక గ్రాస్ ను కలెక్ట్ చేసిన సినిమా ఇదేఅని చెప్పాలి.ఇదిలావుండగా హైదరాబాద్‌లో మొత్తంగా దాదాపు రూ.1.22 కోట్ల వసూళ్లు సాధించింది.అలాగే ఆస్ట్రేలియాలో సైతం దాదాపు నాలుగు వేల అయిదువందల ఆస్ట్రేలియా డాలర్లు కొల్లగొట్టింది.మొత్తంగా వరల్డ్ వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.3కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.5కోట్ల గ్రాస్ తో వరల్డ్ వైడ్ గా 8 కోట్లతో ఓవరాల్ గా రీ రిలీజ్ లలో కలెక్షన్స్ ని ఓపెనింగ్ డే లో అందుకున్న లాంగ్ రన్ లో టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది.ఈ విధంగా రీ రిలీజ్‌లలో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన తెలుగు సినిమా దిశగా దూసుకెళ్లింది గబ్బర్ సింగ్.