కొన్ని సినిమాలు విడుదలైన సమయంలో ప్రేక్షకులకు అంతగా ఎక్కవు..కాని మళ్లీ రీ రిలీజ్ చేస్తే మాత్రం సంచలనాలు సృష్టించాయి. అలా విడుదలైన సమయంలో డిజాస్టర్ అయ్యి మళ్లీ రీ రిలీజ్ లో సంచలనం సృష్టించిన ఆరెంజ్ సినిమా గురించి మనకు తెలిసిందే.అయితే ఆరెంజ్ మూవీ లాగే ధనుష్ నటించిన త్రీ సినిమా కూడా విడుదలైన సమయంలో ప్రేక్షకులను అంతగా అట్రాక్ట్ చేయలేక పెద్ద డిజాస్టర్ అయింది.కానీ ఇదే సినిమాని రీ రిలీజ్ చేయగా అతిపెద్ద సంచలనం సృష్టించింది. మరి రీ రిలీజ్ లో ధనుష్ నటించిన త్రీ మూవీ ఏ విధంగా సంచలనాలు సృష్టించిందో ఇప్పుడు చూద్దాం.
త్రీ మూవీ రి రిలీజ్:
ధనుష్, శృతిహాసన్ కాంబినేషన్లో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన త్రీ సినిమా అందరూ చూసే ఉంటారు.ఈ సినిమాల్లో ధనుష్ శృతిహాసన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చూసేవారిని ఆకట్టుకుంటాయి. ఇక ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాతగా కూడా చేసింది. అలా 2012లో విడుదలైన త్రీ సినిమా రొమాంటిక్ సైకాలజీకల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో మొదటి రెండు మూడు రోజులలోనే డిజాస్టర్ అని టాక్ వచ్చింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ సినిమాలోని పాటలు మాత్రం చాలా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చేశారు.
ఈ సినిమాలోని వై దిస్ కొలవెరి అనే పాటని ధనుష్ స్వయంగా పాడారు. అలా సినిమాలోని పాటలు ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోవడంతో డిజాస్టర్ అయింది. కానీ ఇదే సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 14న రీ రిలీజ్ చేయగా అడ్వాన్స్ బుకింగ్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. బై పోలార్ డిజాస్టర్ చుట్టూ తిరిగిన ఈ సినిమా ఇప్పటి జనరేషన్ ని ఆకట్టుకోవడంతో మొదటి రోజే మంచి కలెక్షన్స్ సాధించింది.అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజే త్రీ మూవీ 2.5 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలా ఫస్ట్ టైం విడుదలైన సమయంలో డిజాస్టర్ అయ్యి రీ రిలీజ్ సమయంలో ట్రెండ్ సృష్టించిన సినిమాలుగా ధనుష్ నటించిన త్రీ సినిమా రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి