నాగార్జున చేసిన శివ మూవీ ఆ హీరో చేయాల్సిందా..కానీ బ్యాడ్ లక్.?

Pandrala Sravanthi
అక్కినేని నాగార్జున మాస్ హీరోగా చేసిన శివ మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పటివరకు ఈయన చేసిన సినిమాలు ఒకెత్తయితే శివ సినిమా ఒకెత్తని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు నాగార్జున నటన చూసి ఎంతో మంది విమర్శించారు. అసలు ఈయన హీరో అవుతారా అని కూడా హేళనగా మాట్లాడారట. కానీ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా నాగార్జున ని వేరే లెవెల్ కి తీసుకెళ్లి పెట్టింది.. రాంగోపాల్ వర్మ దర్శకుడిగా..నాగార్జున అమల హీరో హీరోయిన్లుగా రఘువరన్ విలన్ గా చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది.. అయితే నాగార్జునకి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిన శివ సినిమా నాగార్జున చేయాల్సింది కాదట. వేరే హీరో చేయాల్సింది. కానీ నాగార్జున చేశారట.మరి ఇంతకీ శివ మూవీని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. 

శివ మూవీని చేతులారా కాదనుకున్న ఆ హీరో ఎవరో కాదు దగ్గుబాటి వెంకటేష్.అవును మీరు వినేది నిజమే. విక్టరీ వెంకటేష్ కే ముందుగా శివ సినిమా కథ ఆఫర్ వచ్చిందట. ఈ సినిమా వెంకటేష్ చేయడం కోసం రాంగోపాల్ వర్మ దాదాపు నెల రోజులపాటు వెయిట్ చేసి మరీ ఈ స్టోరీ రామానాయుడు కి చెప్పారట. అయితే ఈ స్టోరీ బాగున్నప్పటికీ రామానాయుడు మాత్రం వెంకటేష్ తో శివ మూవీ వద్దని చెప్పారట.

ఎందుకంటే వెంకటేష్ అప్పటికే కుటుంబ కథ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి టైం లో శివ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న సినిమా చేస్తే వెంకటేష్ ని అభిమానులు యాక్సెప్ట్ చేయరు అనే ఉద్దేశంతో రామానాయుడు వద్దని చెప్పారట. రామానాయుడు వద్దని చెప్పడంతో ఈ సినిమా స్టోరీ నాగార్జునకి చెప్పారు రామ్ గోపాల్ వర్మ..ఇక నాగార్జునకి ఈ స్టోరీ నచ్చడంతో ఆయన ఓకే చేశారు. అలా శివ సినిమా వెంకటేష్ వద్దనుకుంటే నాగార్జున చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: