స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 పై అంచనాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 5న సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ సినిమాతో రికార్డు స్థాయి వసూళ్లు సాధించనున్నట్లు ఇప్పటికే సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప 1 కంటే కూడా హై రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో కథా, కథనాలు, యాక్షన్ సన్నివేశాలు, అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ అన్ని వేరే లెవెల్లో ఉంటాయని సుకుమార్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.అయితే, ఈ సినిమాతో ‘పుష్ప’ కథకు కొత్త రూట్ సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ తర్వాత కూడా ‘పుష్ప 3’ పేరుతో మరో చిత్రం రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పుష్ప 2 క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజింగ్ ట్విస్ట్ ఇవ్వాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ముఖ్యంగా మరో స్టార్ హీరో వాయిస్‌ను వినిపిస్తూ, ‘పుష్ప 3’కు లీడ్ ఇచ్చేలా క్లైమాక్స్‌ను ప్లాన్ చేశారని సమాచారం. ఈ ఎత్తుగడతో ప్రేక్షకుల్లో పుష్ప 3పై మరింత ఆసక్తి పెంచాలని, కథలో కొత్త మలుపు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.ఐతే పుష్ప 2 ముగింపులో పార్ట్ 3 లీడ్ కూడా అదిరిపోతుందని టాక్. సెన్సార్ అయిపోయి సినిమా చూసిన కొందరు సెలబ్రిటీస్ దీనిపై ఆసక్తికరంగా చెబుతున్నారు.
పుష్ప 2 ఎండ్ కార్డ్ అదే పుష్ప 3 కి ఇచ్చే లీడ్ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. పుష్ప 2 క్లైమాక్స్ లో భాగంగానే ఆ లీడ్ ఉంటుందని ఇది ఆడియన్స్ ని సీట్లలో కూర్చోనివ్వదని అంటున్నారు.అసలే పుష్ప రాజ్ మేనియాలో నేషనల్ లెవెల్ గా ఆడియన్స్ అంతా ఊగిపోతున్న ఈ టైం లో పుష్ప 3 గురించి వచ్చిన ఈ అప్డేట్ తో పుష్ప ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. పుష్ప 3 సినిమా కథ ఎలా టర్న్ తీసుకుంటుంది. అసలు సుకుమార్ ఏం చేయబోతున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా నేషనల్ లెవెల్ లో చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు సినిమాపై మరింత బజ్ పెరిగేలా చేస్తున్నాయి.అలాగే, క్లైమాక్స్ సీన్లు షూట్ చేసే క్రమంలో ‘పుష్ప 3’కి లీడ్ ఇస్తున్న కీలక పాత్ర కోసం ప్రముఖ హీరోను ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మరి ఆ హీరో ఎవరో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పుష్ప 2 నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప 3ని కూడా ఇదే స్థాయిలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.