ఉదయం 5గంటలకే.. ఆ పని చేయమని భార్య బలవంత పెట్టేది.. RGV కామెంట్స్ వైరల్..!

Divya
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో బడ నిర్మాతలతో స్టార్ హీరోలతో భారీ పరిచయాలు ఏర్పరచుకున్నారు వర్మ. అందుకే వర్మ ఏం చేసినా కూడా ఏం మాట్లాడినా అది ఒక సెన్సేషనల్ గా మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ చిత్రాలను తీసిన వర్మ ఈ మధ్యకాలంలో బోల్డ్ చిత్రాలను తీస్తూ ఉన్నారు. ఇటీవలే వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య కూతురు గురించి పలు విషయాలను తెలియజేశారు.

బాలీవుడ్ లో కూడా బిగ్ బి వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన వర్మ తన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకున్నారు.అతి తక్కువ సమయంలోనే సినిమాలను తీసి సరికొత్త రికార్డులను సృష్టించేవారు వర్మ. ముఖ్యంగా తన సినిమాలు ఫ్లాపులు సక్సెస్ అనే సంబంధం లేకుండా తీస్తూ ఉంటారు. తాజాగా వర్మ చేసిన కామెంట్స్ విషయానికి వస్తే తన భార్య తనకు నచ్చని కొన్ని పనులు చేసేది అని దీనివల్ల తాను ఇబ్బందులు పడ్డాను అంటూ తెలిపింది..

ఉదయం ఐదు గంటలకి నిద్ర లేపి పాల్బుతికి వెళ్లి పాల ప్యాకెట్లు తీసుకురమ్మనేదని ఆ విషయం తనకు అసలు నచ్చేది కాదని..తనని వెళ్లి తెచ్చుకోమనే వాడినట్టు తెలిపారు.ఐదు గంటలకి నిద్రలేచి కాఫీ తాగడం కంటే మరో రెండు గంటలు నిద్రపోతే మంచిదని తాను భావిస్తానని తెలిపారు వర్మ.. శివ సినిమా షూటింగ్ సమయంలో తనకు కూతురు పుట్టిందని ఆ సమయంలో డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా తనకు కంగ్రాచులేషన్స్ తెలిపారని.. కానీ వర్మ తనకు శివా సినిమా సక్సెస్ అయ్యి ఉంటే ఇలా చెప్పారు ఏమో అనుకున్నా అని కానీ అప్పటివరకు ఆడపిల్లలు పుడితే కంగ్రాట్స్ చెబుతారని విషయం తనకు తెలియదని తెలిపారు వర్మ. మొత్తానికి వర్మ ఏం చేసినా కూడా సెన్సేషనల్ గా మారుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: