భళా మహేశ్ బాబు...తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన "భరత్" ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆ తర్వాత... టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా మారిపోయాడు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు తీసిన చాలా సినిమాల్లో అన్ని బంపర్ హిట్టే అవుతాయి. అందులో.. రకరకాల సినిమాలు వస్తున్నాయి.
ఇక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాలు మహేష్ బాబు.. తీసి సక్సెస్ కూడా అయ్యాడు. అందులో భరత్ అనే నేను ఒకటి. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పాత్రలో ఉన్న తన తండ్రి మరణించడంతో విదేశాల నుంచి వచ్చి.. ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకుంటారు మహేష్ బాబు. భరత్ అనే నేను.. అంటూ.. ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు.
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా నిర్మాతగా డివివి దానయ్య ఉన్న సంగతి తెలిసిందే. ప్రిన్స్ మహేష్ బాబు సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఒక యంగ్ డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి అవుతే ఎలాంటి మార్పులు చేస్తాడు.. ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. కొరటాల శివ ప్రతి సినిమా ప్రజల కోసం ఉద్దేశించినట్లుగానే ఉంటుంది.
భరత్ అనే నేను సినిమా కూడా అచ్చం జనాల కోసం ఉపయోగపడేలానే ఉంటుంది.ప్రస్తుత రాజకీయాల్లో... నేతలందరూ అవినీతికి పాల్పడుతున్నారని... వాళ్లలో మార్పులు తీసుకువచ్చేలా... ఈ సినిమా తెరకెక్కించినట్లు మనకు అనిపిస్తుంది. ఇక.. భరత్ అనే నేను సినిమా వచ్చిన తర్వాత చాలామంది రాజకీయ నాయకులు కూడా... ప్రజల కోసం పనిచేసేందుకు నడుము కట్టారు. అలా ఈ సినిమా సమాజంలో పెను మార్పులు తీసుకువచ్చింది.