సమంత : ఊ అంటావాతో ఏకంగా ఆ రికార్డు కొట్టేసింది..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటీమణులలో సమంత ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఏం మాయ చేసావే మూవీతో తెలుగు తేరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సూపర్ సాలిడ్ విజయాన్ని , అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోలా సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. ఇక ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది.

ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఈమె ఎప్పుడు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరియర్ను ముందుకు  సాగిస్తుంది. ఇకపోతే ఈమె కెరియర్లో కేవలం ఒకే ఒక సారి పుష్ప పార్ట్ 1 సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా ... రష్మిక మందన హీరోయిన్గా నటించింది. సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ఈ బ్యూటీ "ఊ అంటావా" అంటూ సాగే సాంగ్ను చేసింది. ఇక కెరియర్లో మొట్ట మొదటి సారి సమంత నటించిన స్పెషల్ సాంగ్ కావడంతో ఈ సాంగ్ పై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సాంగ్ లిరికల్ వీడియో విడుదల కాగానే దీనికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక థియేటర్లో ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇందులో సమంత తన డాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇకపోతే సమంత ఈ సాంగ్ కోసం అదిరిపోయే రేంజ్ లో పారితోషకం తీసుకున్నట్లు ఆ సమయంలో వార్తలు వచ్చాయి. ఈ ఒక్క సాంగ్ కోసం ఈ బ్యూటీ ఏకంగా 1.5 కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకున్నట్లు , అప్పటివరకు తెలుగులో ఒక ఐటమ్ సాంగ్ కోసం ఓ బ్యూటీ తీసుకున్న హైయెస్ట్ పారితోషకం అని కూడా వార్తలు వచ్చాయి. అలా "ఊ అంటావా" సాంగ్ కోసం సమంత భారీ పారితోషకాన్ని తీసుకొని రికార్డు సృష్టించినట్లు ఆ సమయంలో వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: