టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ కచ్చితంగా ఉంటుంది. ఐటెం సాంగ్ లేకపోతే సినిమా సూపర్ హిట్ కావడం లేదు. అందుకే దర్శక నిర్మాతలు కచ్చితంగా ఐటమ్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే... చాలామంది హీరోయిన్లు కూడా... ఐటెం సాంగ్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. భారీగానే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు.
అయితే టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే.. రంగస్థలం సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. హీరో రామ్ చరణ్ రంగస్థలంలో.. కథానాయకుడిగా చేయగా... హీరోయిన్గా సమంత చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా 2018 మార్చి 30వ తేదీన రిలీజ్ అయి బంపర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్... పనిచేయడం జరిగింది.
ఇక 60 కోట్లతో ఈ సినిమా చేస్తే 216 కోట్లు సంపాదించింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచిందన్నమాట. అయితే ఈ సినిమాలో జిగేలు రాణి ఐటెం సాంగ్ చేసింది పూజా హెగ్డే. అప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజ హెగ్డే పేరు మారుమోగుతోంది. ఆ సమయంలో హీరోయిన్ పూజా హెగ్డేను.... ఐటెం సాంగ్ లో దింపాడు. ఇక ఈ పాటతో పూజా హెగ్డే చేసిన డాన్స్... అందరిని ఆకట్టుకుంది. ఎల్లో చీర, పల్లెటూరి డ్రెస్సుల్లో ఈ పాటలు కనిపిస్తుంది హీరోయిన్ పూజా హెగ్డే.
ఇక రంగస్థలం సినిమాలో పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేయడంతో ఆ సినిమాకే మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాకు దాదాపు కోటి రూపాయలు తీసుకుందట పూజా హెగ్డే. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్డే పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఆమెకు తెలుగులో సినిమాలే లేవు. అటు తమిళంలో కూడా అవకాశాలు ఎవరు ఇవ్వడం లేదు.గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు కొన్ని సీన్లు తీసిన తర్వాత ఆమెను తప్పించారు.