అఖిల్‌కి కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. వైఎస్. జగన్ ఫ్యామిలీకి క్లోజ్..!
సాధారణంగా సెలబ్రిటీల పెళ్లంటే వరుడు ? ఎవరు వధువు ఎవరు ? వారు ఏం చేస్తూ ఉంటారు ? ఎలా ఉంటారు వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి అన్నదానిపై అందరికీ సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఆ సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తి అభిమానులతో పాటు .. ఇటు సినీ ప్రేమికులకు .. సాధారణ ప్రజలకు కూడా ఆసక్తి ఉంటుంది. తాజాగా టాలీవుడ్ నవమన్మధుడు అక్కినేని అఖిల్‌కు ప్రముఖ ఆర్టిస్ట్ జైనాబ్ రావ్డ్జీ తో ఎంగేజ్మెంట్ జరిగింది. గతంలో అఖిల్ కు ప్రముఖ పరిశ్రమకు వేత్త జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి వరకు రాకుండానే క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్ తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఆమె ఎవరు అన్నది ? తెలుసుకోవాలని చాలామంది ఇంటర్నెట్లో .. సోషల్ మీడియా బాగా సెర్చ్ చేస్తున్నారు.
మనకు అందుతున్న సమాచారం ప్రకారం తండ్రి జుల్ఫీ రావ్డ్జీ అని తెలిసింది. ఆయన మరెవరో కాదు ? ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా పనిచేసినట్టు సమాచారం. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించినట్లు సమాచారం. అలాగే ఈ కుటుంబానికి జగన్ - నాగార్జున ఫ్యామిలీ తో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. మరో విషయం ఏంటంటే అఖిల కంటే జైనాబ్ ఏకంగా 9 ఏళ్ళు పెద్దది అని చెబుతున్నారు. ప్రస్తుతం జైనాబ్ వయసు 39 ఏళ్లు కాగా ... అఖిల్ వయసు 30 అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి చాలా మంది షాక్ కు గురవుతున్నారు. మరికొందరేమో వయసుతో సంబంధం ఏముంది ? అని అంటున్నారు. ఇక జైనాబ్ గతంలో మీనాక్షి అనే సినిమా కూడా చేసినట్టు సమాచారం. జైనాబ్ ఒక ఆర్టిస్టు ... గతంలో హైదరాబాదులో రిఫ్లెక్షన్ పేరుతో కళాకృతి గ్యాలరీలో ఓ పెయింట్ ఎగ్జిబిషన్ పెట్టింది. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటూ పలు వ్యాపారాలు చేస్తుంది. ఆమె ఎక్కువగా లండన్ - దుబాయి - ఇండియా - షార్జా దేశాల చుట్టూ చక్కెరలు కొడుతూ ఉంటుంది.