చైతు - శోభిత పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు.. కారణం అదేనా?
విషయం ఏమిటంటే, త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. డిసెంబరు 4వ తేదీన ఈ కొత్త దంపతులు నూతన జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలోనే వీరి వివాహ వేడుకకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో సమంతను రెండుసార్లు రెండు వేరువేరు చోట్ల వివాహం చేసుకున్న చైతన్య, ప్రస్తుతం వారి సొంత స్టూడియో అయినటువంటి నాగార్జున స్టూడియోలో వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పైగా అన్నపూర్ణ స్టూడియోలో కొలువైయున్న అక్కినేని నాగేశ్వరరావు గారు విగ్రహం ముంగట ఓ ప్రత్యేకమైన సెట్ వేయించి అందులో వీరి వివాహానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం. తన తాత ఆశీర్వాదం తన జంట పై ఉంటే, తమకు అదే పెద్ద ఆశీర్వాదం అని చైతన్య ఫీలవుతున్నట్టు సమాచారం. ఆ ఉద్దేశంతోనే నాగార్జున వీరి వివాహానికి అన్నపూర్ణ స్టూడియోలో కళ్యాణమండపం సెట్ ఏర్పాట్లు దగ్గరుండి మరి చూసుకుంటున్నారు.
కాగా నాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనుంది. ఈ వేడుక ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో మాత్రమే జరగనుందని టాక్. ఈ పెళ్లి గురించి ఇటీవల నాగార్జున స్పందిస్తూ... చైతన్య వివాహానికి కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నట్టు అధికారికంగా తెలిపారు. అదేవిధంగా రిసెప్షన్ వివరాలను త్వరలో తెలుపుతామని కూడా తెలిపినట్టు సమాచారం. నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ కోసం వర్క్ చేస్తున్నారు. దీనికి కార్తికేయ సినిమా దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సింగిల్స్ జనాలను అలరిస్తున్నాయి. ఈ సినిమా పైన అక్కినేని ఫ్యాన్స్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.