వచ్చే సంక్రాంతికి అసలు పోటీనే లేదు.. ఎలానో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ వచ్చింది అంటే చాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి వాతావరణం నేలకొంటూ ఉంటుంది. ఇక స్టార్ హీరోల సినిమాలు సాధారణంగా సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువగా విడుదల అవుతుంటాయి కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో వార్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. దానితో ఏ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేస్తుందో ఆ సినిమా సంక్రాంతి విన్నారుగా నిలవడం , కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తక్కువ కలెక్షన్లను వసూలు చేయడం జరగడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది.

బారి కలెక్షన్లను వసూలు చేసిన సినిమా నిర్మాతలకు భారీ లాభాలు రాగా , తక్కువ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలకు , ఫ్లాప్ సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించిన వారికి నష్టాలు రావడం సర్వసాధారణం. కానీ వచ్చే సంవత్సరం మాత్రం సంక్రాంతి పండుగకు ఎవరికీ పెద్దగా నష్టాలు వచ్చే అవకాశాలు కనబడడం లేదు. ఎందుకు అంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమా , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఈ మూడు సినిమాలలో గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్ రాజు నిర్మించాడు. ఇక డాకు మహరాజ్ సినిమా ద్వారానే దిల్ రాజుకు పోటీ అని చాలా మంది అనుకున్నారు.

కానీ డాకు మహరాజ్ సినిమా థియేటర్ హక్కులను కూడా దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దానితో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అయినా కూడా దిల్ రాజు కే లాభం , అలాగే ఏ సినిమా తక్కువ కలెక్షన్లను వసూలు చేసిన ఆ సినిమా ద్వారా దిల్ రాజకీయ నష్టం. దీనితో దిల్ రాజుకు ఏదో ఒక సినిమా ద్వారా లాభం వచ్చిన , ఏదో సినిమా ద్వారా నష్టం వచ్చిన పెద్దగా ప్రాబ్లం ఉండదు అని చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: