బాలీవుడ్ హీరోలతో రాజమౌళి ఎందుకు సినిమా చేయడు..? దాని వెనక ఉన్న బిగ్ రీజన్ ఇదే..!

frame బాలీవుడ్ హీరోలతో రాజమౌళి ఎందుకు సినిమా చేయడు..? దాని వెనక ఉన్న బిగ్ రీజన్ ఇదే..!

Thota Jaya Madhuri
రాజమౌళిని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈ డౌట్ ఎప్పటినుంచో ఉండనే ఉంటుంది . రాజమౌళి ఎందుకు తెలుగు హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటాడు..? ఎందుకు బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడు..? ఈ విషయం చాలా చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది . నిజమే రాజమౌళి - బాలీవుడ్ హీరోలపై ఇంట్రెస్ట్ చూపించరు. కానీ రీసెంట్గా తన కూతురు మయూఖాకు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా అంటే ఇష్టం అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .


అయితే రాజమౌళి మాత్రం నాకు పలానా బాలీవుడ్ హీరో అంటే ఇష్టం అని చెప్పనే చెప్పడు. అసలు ఆయన సినిమాలలో బాలీవుడ్ హీరోలను చూపించే సాహసం కూడా చేయడు. ఎందుకు ఆయనకు బాలీవుడ్ హీరోలు అంటే ఇష్టం లేదా ..? అనే విధంగా కూడా జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే దాని వెనక బిగ్ రీజనే ఉంది అంటున్నారు సినీ ప్రముఖులు . సాధారణంగా బాలీవుడ్ హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు . అది హీరో రోల్ కాకపోయినా సరే పెద్ద పెద్ద రెమ్యూనరేషన్ లు డిమాండ్ చేయడమే కాకుండా కాల్ షీట్స్ చాలా తక్కువగా కేటాయిస్తూ ఉంటారు .


తిప్పి తిప్పి కొడితే మహా అయితే వాళ్ళు నెల రోజుల కి మించి కాల్ షీట్స్ ఇవ్వరు.  అది రాజమౌళికి అస్సలు కుదరదు.  ఆ బాలీవుడ్ హీరోలకి అస్సలు సెట్ అవ్వదట . రాజమౌళి ఏమో రెండేళ్లు మూడేళ్లు కాల్ షీట్స్ మింగేసే టైప్. బాలీవుడ్ హీరోలేమో నెల రోజులకు మించి కాల్ షీట్స్ ఇవ్వరు . మరి అలాంటి మూమెంట్లో రాజమౌళికి బాలీవుడ్ హీరోలకి ఎలా సెట్ అవుతుంది. ఆ కారణంగానే బాలీవుడ్ హీరోలను తన సినిమాలల్లో ఎక్కువగా తీసుకోరట.  టాలీవుడ్ - కోలీవుడ్ హీరోల తోనే ఆయన సినిమాలు తెరకెక్కించాలని ఆలోచిస్తూ ఉంటారట . ప్రజెంట్ మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి . రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది చిత్ర బృందం..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: