సూపర్ స్టార్
కృష్ణ తన కెరియర్ లో ఎన్నో
బ్లాక్ బస్టర్ మూవీ లలో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే
కృష్ణ నటించిన అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో సింహాసనం
మూవీ ఒకటి. ఇక ఈ సినిమాలో
కృష్ణ హీరో గా నటించడం మాత్రమే కాకుండా , ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అలాగే నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాకు ఎడిటర్ గా కూడా
కృష్ణ పని చేశాడు. ఇలా అన్ని తానై ఈ సినిమాను ముందుండి
కృష్ణ నడిపించాడు.
ఇక తెలుగులో వచ్చిన మొట్ట మొదటి 70 ఎం ఎం స్టీరియో ఫోనిక్ సౌండ్
సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇకపోతే భారీ అంచనాల నడప విడుదల అయిన ఈ
సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది. ఈ
మూవీ లో
జయప్రద , రాధ
హీరోయిన్ లుగా నటించారు. ఈ
సినిమా 1986 వ సంవత్సరం విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాను ఆ సమయం లోనే 3.5 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఆ సమయంలో మూడున్నర కోట్లతో సినిమాను రూపొందించడం అనేది చిన్న విషయం కాదు.
అలా భారీ బడ్జెట్లో రూపొందిన ఈ
సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఫైనల్
బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఐదు కోట్ల కలెక్షన్లను రాబట్టి పెద్ద రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించిన 100 రోజుల వేడుకను ఈ
మూవీ బృందం వారు
చెన్నై లో నిర్వహించారు. ఆ
ఈవెంట్ కు
కృష్ణ అభిమానులు 400 బస్సులతో అక్కడికి చేరుకున్నారు. ఇకపోతే ఇలా
కృష్ణ అన్నీ తానే ముందుకు నడిపించిన సింహాసనం
సినిమా ఆ సమయంలో కలెక్షన్ల వర్షాన్ని కురిపించి అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది.