పుష్ప 2 పై అమ్మ నా బూతు ట్రోలింగ్.. సుక్కు సైలెంట్ గా ఉండటానికి కారణం "ఆయనే"నా..?

Thota Jaya Madhuri
మనం బాగా గమనించిన్నట్లయితే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమాపై ఎంత పరమ చెత్త ట్రోలింగ్ జరుగుతుందో అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో తెలిసిందే.  మరి ముఖ్యంగా అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి .. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కానీ పుష్ప2 సినిమాపై జరిగిన ట్రోలింగ్ మరి ఏ సినిమాకి జరగకపోవడం గమనార్హం. పుష్ప2 సినిమాపై కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారు అంటున్నారు బన్ని  అభిమానులు. దానికి రీజన్స్ కూడా అందరికీ తెలిసిందే . ఒక బిగ్ పడా ఫ్యామిలీ కావాలని పుష్ప2 సినిమాను తొక్కేయడానికి బ్యాక్ గ్రౌండ్లో చాలా విధాలుగా ట్రై చేస్తుంది అంటూ కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి .


డిసెంబర్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది పుష్ప2 సినిమా.  ఇలాంటి క్రమంలోనే అటు సోషల్ మీడియాలో ఇటు సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్ చేయడమే కాకుండా పుష్ప గాడి లుక్స్ పై అమ్మ నా బూతు కామెంట్స్ కూడా చేస్తున్నారు . అయినా సరే డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఎక్కడ ఒక్క మాట కూడా  టంగ్ స్లిప్ కావడం లేదు . అసలు ఎందుకు పుష్ప2  పై ట్రోలింగ్ చేస్తున్నారు అన్న విధంగా ఒక పోస్ట్ కూడా పెట్టలేదు .


తన పని తాను చేసుకుపోతున్నాడు . సినిమాకి ప్రమోషన్స్ ని ఎలా నిర్వహించాలి..? రిలీజ్ టైం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అన్న విషయం కారణంగానే ఫోకస్ చేస్తున్నాడు తప్పిస్తే పుష్ప2 పై ఎవరు ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అన్న విషయంపై అస్సలు పట్టించుకోవడం లేదు . అంత ధీమా ఆయనకి ఎలా వచ్చింది..? అంటే కారణం మాత్రం బన్నీనే అంటున్నారు జనాలు.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కటే సుకుమార్ నమ్ముకున్నాడు అని .. సినిమాని ఎలాగైనా సరే బన్నీ అభిమానులు హిట్ చేసి పెడతారని ..ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా కానీ పుష్ప2 రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ మొత్తం సినిమాకి పాజిటివిటీగా మార్చేస్తారు బన్నీ అభిమానులు అన్న ధీమా కారణంగానే సుకుమార్ సైలెంట్ గా ఉన్నాడట . చూద్దాం మరి సుకుమార్ నమ్మకం ఏమాత్రం నిలబెట్టుకుంటారో బన్నీ అభిమానులు..!!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: