ఎన్టీఆర్ - అల్లు అర్జున్ కు ఊహించని షాక్ .. ఆ పార్టీ అభిమానులు ఇద్దరికీ తలనొప్పిగా మారారుగా..!
అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఇద్దరు హీరోలకు ఇప్పుడు ఒకే తరహా సమస్య వచ్చి పడింది. తమకు బ్యాక్ గ్రౌండ్ గా చెప్పుకున్న తమ కుటుంబాలు ఇద్దరిని దూరం పెడుతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఒక పార్టీ అభిమానులు వీరికి అండగా నిలబడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ అయిన టైంలో కొందరు పనిగట్టుకుని సినిమాపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారు. అయితే దానికి కౌంటర్‌గా ఎన్టీఆర్ అభిమానులతో పాటు వైసిపి పార్టీ సానుభూతిపరులు కూడా సోషల్ మీడియాలో పోస్ట్లుు పెట్టారు. అదే ఇప్పుడు ఎన్టీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. వైసీపీకి చెందిన సానుభూతిపరులు మద్దతు తెలుపుతుంటే తనపై ఎలాంటి ముద్ర పడుతుందోని ఆయన ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ వాళ్లు ఇన్వాల్వ్ అయితే నందమూరి కుటుంబానికి మరింత ఆగ్రహం వస్తుందని ఆయన భావిస్తున్నారు.
అల్లు అర్జున్ కు కూడా ఇదే తరహా సమస్య వెంటాడుతుంది. అల్లు అర్జున్ కు మెగా అభిమానులకు కొంత గ్యాప్ వచ్చింది. ఇది రోజురోజుకు బాగా ముదురుతుంది. ఇదే క్రమంలో అల్లు అర్జున్ కు వైసిపి అభిమానులు మద్దతు ఇస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పుష్ప2 ట్రైలర్ కు అదిరిపోయే స్పందన వస్తుంది ట్రైలర్ బాగుందని అంతా ప్రశంసలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రైలర్‌తో పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో సమానంగా వైసిపి అభిమానులు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు ఇప్పుడు ఇదే అల్లు అర్జున్ కు పెద్ద ఇబ్బందిగా మారుతుందని అంత అంటున్నారు.. వైసిపి ఇన్వాల్వ్మెంట్తో మెగా అభిమానులను మరింత రెచ్చగొడుతున్నట్లు అవుతుందేమో అని బన్నీ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాలతో సంబంధం లేకుండానే తమ హీరోలను వాటిలోకి లాగుతున్నారని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ హీరోలను కొందరు కావాలనే సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.. తమ హీరోల జోలికి ఎవ్వరూ రాకుంటేనే మంచిదని అలా కాదని ఇష్టానుసారంగా పోస్టులు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమని కూడా అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో తమ హీరోలకు మద్దతిస్తున్న వైసీపీ క్యాటర్ను కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నారు నిజంగా మద్దతిస్తే సరే కానీ అనవసరంగా రాజకీయాలు చేయకండి అంటూ వారికి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. సినిమాను సినిమాలో చూడండి తప్ప రాజకీయాలు చోడించకండి అంటూ ఇద్దరు హీరోల అభిమానులు అందర్నీ కోరుకుంటున్నారు.