చట్టంతో RGV ఆటలు..సినిమా రేంజ్‌ లో పోలీసులకు చుక్కలు ?

Veldandi Saikiran
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినిమాలకన్నా ఎక్కువగా ఆయన సోషల్ మీడియాలో వేదికగా చేసే వివాదాస్పద పోస్టులకి ఎక్కువగా వైరల్ అవుతున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఆయన నవంబర్ 19న విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ రామ్ గోపాల్ వర్మ తాను సినిమా షూటింగ్స్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నానని తన తరపు లాయర్ చేత రిక్వెస్ట్ లెటర్ పంపించారు.

మంగళవారం జరగనున్న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆర్జీవికి నోటీసులు అందించారు. అయితే మంగళవారం పోలీసుల విచారణకు ఆర్జీవి హాజరు కాలేకపోయాడు. అదే సమయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్జీవి తరపున న్యాయవాది పోలీసుల వద్దకు వెళ్లారు. షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా హాజరు కావడం లేదని, కనీసం వారం సమయం ఇవ్వాలంటూ ఆర్జీవి పంపిన లేఖను న్యాయవాది పోలీసులకు అప్పగించారు.

మరోవైపు రాంగోపాల్ వర్మ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉన్నట్లుగా పిటిషన్ లో పేర్కొన్నారు. అందువల్ల తనపై నమోదు చేసిన కేసులో హైకోర్టులో పిటిషన్ వేశారు వర్మ. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ  పిటిషన్ వేశారు వర్మ.  వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎక్స్ లో కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు పెట్టారు మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం.రామలింగం.

మద్దిపాడు పోలీసులకు మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం.రామలింగం.... ఫిర్యాదు చేయడంతో వర్మపై ఐటీ యాక్ట్ కింద ఈ నెల 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు ఇప్పుడు దర్యాప్తులో ఉంది.. కాగా, వర్మ కోర్టుకు హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV

సంబంధిత వార్తలు: