"యానిమల్‌" టీంకు షాక్‌..హిట్‌ అయినా రూ.40 కోట్ల నష్టం ?

Veldandi Saikiran
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి దర్శకత్వంలో యానిమల్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో రష్మిక మందన, తృప్తి దిమ్రి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి నటన చాలా అద్భుతంగా ఉంది. కాగా, ఈ సినిమాను టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై క్రిషన్ కుమార్, భూషణ్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు కలిసి నిర్మించారు. దీనికి విశాల్ మిశ్రా, ప్రీతమ్, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు.

ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్, శక్తి కపూర్ కీలక పాత్రలలో నటించారు. యానిమల్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ ఈ సినిమాకి తాము రూ. 30-40 కోట్ల రూపాయలు కోల్పోయినట్లుగా చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు.

సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి యానిమల్ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా యానిమల్ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన లెక్కల ప్రకారం మొదటి వారంలో దాదాపు 30-40 కోట్లు కోల్పోయామని చెప్పాడు. దానికి గల కారణం మాకు సరిపోయే అన్ని థియేటర్లు దొరకలేదని చెప్పాడు.

సినిమా నాన్ హాలిడే కి రిలీజ్ అవ్వడం, లాంగ్ వీకెండ్ లాంటివి ఏమీ లేకపోవడం వల్ల మొదటి వారంలో వసూళ్లు చాలా తగ్గాయని చెప్పారు. యానిమల్ A రేటెడ్ సినిమా కావడంతో 3 గంటల 21 నిమిషాల టైం ఉండడం అదే సమయంలో రిలీజ్ అయిన 'సామ్ బహదూర్' సినిమాతో కొన్ని స్క్రీన్లు షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి విషయాలు కలెక్షన్లు తగ్గడానికి కారణం అవుతాయని ప్రణయ్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఇతను మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: