మగవాళ్ళ గొప్పతనం.. మహేష్ బాబు మాటల్లో.. వైరల్ వీడియో?

praveen
సమాజం ఏమనుకుంటుందో అనే చిన్న ఆలోచనతో తన జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మగవాళ్ళు మాత్రమే. కుటుంబం కోసం కెరియర్ కోసం ఏకంగా ఇష్టమైనవన్నీ త్యాగం చేస్తూ ఉంటాడు. తాను చేస్తున్న పనికి పెద్దగా గుర్తింపు రాకపోయినా ఇంట్లో తల్లికి ఉన్న గుర్తింపు తండ్రికి లేకపోయినా.. మా నాన్న చాలా మొరటోడు ఎప్పుడూ కోపంగానే కనిపిస్తాడు అని పిల్లలు అంటున్న లోలోపల తన బాధలన్నీ దాచుకొని పైకి నవ్వుతూనే గంభీరంగా ప్రతి మగాడు. ఒక వైపు భార్యకి మరోవైపు తల్లికి మధ్య నిత్యం నలిగిపోతూనే ఉంటాడు.

 ఉద్యోగంలో వ్యాపారంలో ఎన్ని కష్టనష్టాలు ఉన్న బయటకు చెప్పకుండా.. వీడికి ఏంటి రా బాబు హ్యాపీ లైఫ్.. ఉంటే వీడి లాగా ఉండాలి అని పక్క వాళ్లకు అనిపించే విధంగా ఇక బాధను లోపల దాచుకుంటూనే పైకి నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు ప్రతి మగాడు. అయితే ఇంత చేసిన మగాడికి దక్కాల్సిన గుర్తింపు ఇప్పటికీ దక్కట్లేదు అన్నది ఎంతోమంది మగవాళ్ళ వాదన.  అది సరేగాని ఇప్పుడు మగవాళ్ళ గురించి ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.. నిన్న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరిగింది. ఇక ఈ విషయాన్ని కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకోకుండా మగవాళ్ళు ఎప్పటిలాగానే పనిలో బిజీ అయిపోయారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం మగవాళ్ళ గొప్పతనం ఏంటి అన్న విషయాన్ని ఆయన నోటితోనే చెప్పేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఇలా మెన్స్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మగవారి గొప్పతనంపై ఒక వాయిస్ నోట్ విడుదల చేశారు. ఎవరి కళ్ళల్లో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో.. ఎవరి మనసు మెత్తగా ఉంటుందో.. ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో.. ఎవరికి ఆడవాళ్లు అంటే గౌరవం హృదయంలో అభిమానం ఉంటుందో.. ఎవరు ఆడవాళ్లు అంటే మనిషి అన్న విషయాన్ని మరిచిపోరో.. ఎవరు ఆడవాళ్ళకి సమాజంలో గౌరవం మర్యాద దక్కాలని కోరుకుంటాలో వాళ్లే నిజమైన మగవాళ్ళు అంటూ మహేష్ బాబు మాట్లాడిన ఒక వాయిస్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: