అప్పుడు రమ్యకృష్ణ, ఇప్పుడు వరలక్ష్మి.. విలనిజంతో భయపెట్టేసారుగా?

praveen
సినిమాల్లో అమ్మాయిల పాత్రలు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పువ్వులు, పండ్లు. ఎందుకంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అమ్మాయిలను అంత అందంగా చూపించి.. పువ్వులు పండ్లతో పోల్చి అలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశారు. కానీ అమ్మాయిలు అంటే కేవలం పువ్వులు పనులు మాత్రమే కాదు రక్తాన్ని కళ్ళ చూసే సైకోలు కూడా అని కొంతమంది హీరోయిన్లు నెగటివ్ రోల్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇలా అమ్మాయిలు అంటే కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు హీరోలను సైతం ఎదుర్కొనే విలన్ పాత్రలు  కూడా చేయగలరు.. ఆ పాత్రల్లో మెప్పించగలరు అని కొంతమంది నటీమణులు ఇప్పటికే ప్రూవ్ చేశారు.

 అలాంటి వారిలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒకరు. కోలీవుడ్లో స్టార్ గా కొనసాగుతున్న శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది వరలక్ష్మి. మొదట్లో హీరోయిన్ గానే సినిమాలలో నటించింది. కానీ అందరిలా గ్లామర్ వలకబోయడానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో అందరిలా కాకుండా కొత్త పంథాను ఎంచుకుంది. ఈ క్రమంలోనే హీరోయిన్గా చేయడం మానేసి విలన్ పాత్రలు చేయడం మొదలుపెట్టింది. విలన్ చేయడమే కాదు ఏ సినిమాలో నటించిన పాత్రకి ప్రాణం పోసి తన విలనిజంతో అందరిని మెప్పించింది. ఎంతలా అంటే డైరెక్టర్లు తమ సినిమాల్లో వరలక్ష్మిని పెట్టుకోవడానికి ఆమె కోసం ప్రత్యేకమైన పవర్ఫుల్ విలన్ పాత్ర రాసేంతల తన నటనతో ప్రభావితం చేసింది.

 ఏ వన్ ఎక్స్ప్రెస్ అనే సినిమాలో విలనిజంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన తెనాలి రామకృష్ణ అనే సినిమాలోను నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఇక ఆ తర్వాత సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకేక్కిన యశోద సినిమాలోను ఏకంగా సైకో విలన్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ అనే పాత్రలో నటించి ఎంతలా విలనిజాన్ని పండించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు అటు బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో అన్న మీద పగతో రగిలిపోయే విలన్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఒకప్పుడు రమ్యకృష్ణ తర్వాత ఇక ఇప్పటి కాలంలో ఏకంగా విలన్ గా అంతటి గుర్తింపును సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే ఇటీవల ముంబై కు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలై సచ్ దేవ్తో ఆమె ఏడు అడుగులు వేసింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: