తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా’..స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. దీనితో కలెక్షన్స్ జోరు సైతం బాగా తగ్గింది.. ప్రస్తుతం కంగువ దెబ్బ సూర్య మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపించేలా ఉంది.విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువా సినిమాకు 2000 కోట్ల కలెక్షన్స్ పక్కా అన్న మాటలు చివరికి ట్రోలింగ్ కి దారి తీసాయి..ఆఖరికి జ్యోతిక తన భర్త సినిమాకు మద్దతుగా సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టగా దానిని కూడా నెటిజెన్లు తప్పు బడుతున్నారు..కంగువా సినిమా ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదు.. సూర్య అద్భుతంగా నటించినా కూడా కథ దెబ్బేసింది. కనీసం యాభై శాతం బడ్జెట్ రికవరీ అయినా గొప్పే అనే దిశగా కంగువా కలెక్షన్స్ వున్నాయి.
ఇదిలా ఉంటే కంగువా ఎఫెక్ట్.. కర్ణ మూవీపై పడిందని బాలీవుడ్ సమాచారం.ప్రముఖ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా హీరో సూర్య టైటిల్ పాత్రలో సుమారు 600 కోట్లతో కర్ణ కథను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం... స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో వున్నారు..అయితే ఈ ప్రాజెక్టుని ముందు టేకప్ చేసిన ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాకు అంత భారీ బడ్జెట్ వర్కౌట్ కాదని భావించి వీలైనంత బడ్జెట్ ని తగ్గించమని రాకేష్ ని కోరినట్లు సమాచారం.ఇప్పుడు అలా చేస్తే క్వాలిటీ తగ్గిపోతుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన గురించి అలోచించే పనిలో పడ్డారని తెలుస్తుంది..కంగువా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుంటే బడ్జెట్ ఇష్యూ వచ్చి ఉండేది కాదని తెలుస్తుంది..కానీ కంగువా సూర్య కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోయింది..